బిగ్ బాస్2 : భర్తకు ఎమోషనల్ హగ్.. హౌస్‌లో గీత, నందు రొమాన్స్!
బిగ్ బాస్ షో చివరి అంకం రసవత్తరంగా సాగుతోంది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ ని విజిట్ చేస్తున్నారు. మంగళవారం రోజు దీప్తి, అమిత్, సామ్రాట్ కుటుంబ సభ్యులు హౌస్ ని విజిట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఎపిసోడ్ లో తనీష్, కౌశల్ ఇంటి సభ్యులు హౌస్ లోకి వచ్చారు. చాలా కాలం తరువాత వారి కుటుంబ సభ్యులని కలుసుకుతున్న ఇంటి సభ్యులు భావోద్వేగాల్ని ఆపుకోలేకపోతున్నారు. హౌస్ లో ఎమోషనల్ సన్నివేశాలు కొనసాగుతున్నాయి.

గీత మాధురికి సర్ ప్రైజ్
నేడు బిగ్ బాస్ హౌస్ లో గీత మాధురికి బిగ్ సర్ప్రైజ్ ఎదురు కానుంది. గీత మాధురి భర్త నందు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానికి సంబందించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

ఎమోషనల్ హగ్
భర్త రాగానే సంతోషంతో పులకరించిపోయిన గీత ఒక్కసారిగా అతడిని హత్తుకుంది. నందుకు భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. ఈ దృశ్యాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

టైటిల్ రేసులో
చాలా కాలంతరువాత కలుసుకున్న ఈ జంట మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియాలంటే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో గీత మాధురి కూడా టైటిల్ రేసులో ఉంది. ఓ రకంగా కౌశల్ కు గీతనే ప్రత్యర్థి అని ఆడియన్స్ అంటున్నారు.

తీవ్ర ఉత్కంఠ
ఫైనల్స్ లో కేవలం ఐదుగురు మాత్రమే ఉంటారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











