అంటే.. సుందరానికి ఫస్ట్ టైమ్ టీఆర్పీ.. నాని కెరీర్ లోనే దారుణంగా..

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర ద్వారానే ఎక్కువగా ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కామెడీ సినిమాల తోనే జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక అతని నుంచి చాలాకాలం తర్వాత వచ్చిన అంటే.. సుందరానికి సినిమా విడుదలకు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసింది. ఈ ఏడది జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే భారీగానే అందుకుంది.

అయితే పూర్తిస్థాయిలో మాత్రం సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇటీవల టెలివిజన్ లో మొదటిసారి ప్రసారం కాగా అతి దారుణమైన రేటింగ్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నాని కెరీర్ లో ఎలాంటి సినిమా అయినా సరే టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల జెమినీ టీవీలో 'అంటే.. సుందరానికి' ప్రీమియర్స్ కు దారుణమైన రేటింగ్స్ వచ్చాయి.

Nani ante sundaraniki movie first time television trp nani career disaster record

ఒక విధంగా అతని కెరీర్ లోనే ఇది ఒక బ్యాడ్ టెలివిజన్ టిఆర్పి అని చెప్పవచ్చు. అంటే సుందరానికి సినిమాలో నానికి జోడిగా నజ్రీయా నటించింది. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక టెలివిజన్ ప్రీమియర్ కు కేవలం 1.88 రేటింగ్ మాత్రమే దక్కినట్లు తెలుస్తోంది. నాని సాధారణ సినిమాలు కూడా పదికి పైగానే రేటింగ్స్ అందుకుంటూ ఉంటాయి.

అతని డిజాస్టర్ అయినా సినిమాలు కూడా రేటింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేశాయి. అలాంటిది అంటే సుందరనికి సినిమాకు కొంత పాజిటివ్ టాక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా తక్కువ రేటింగ్స్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక విధంగా ఈ సినిమాను ముందే ఓటీటీలో చాలాసార్లు చూశారు. ఆ ప్రభావం అయితే కొంత చూపించినట్లు చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో కూడా ఓటీటీ ప్రభావం టెలివిజన్ కంటెంట్ పై కాస్త ఎక్కువగానే చూపే అవకాశం ఉంటుందనీ అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X