బిగ్‌బాస్2 హోస్ట్‌గా ఆకట్టుకొంటున్న నాని.. ఏదైనా జరుగొచ్చని వార్నింగ్!
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో రెండో సీజన్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు రానున్నది. బిగ్‌బాస్ ఒకటో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్ ఆ కార్యక్రమం నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ.. స్టార్ మా నిర్వాహకులు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు.
వార్త కథనాల ప్రకారం జూన్ 10వ తేదీన బిగ్‌బాస్2 ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాని ఫొటో ఉన్న ప్రోమోను తాజాగా విడుదల చేశారు స్టార్ మా నిర్వాహకులు. దీంతో నాని హోస్ట్ అనే విషయం ఖారారైపోయింది. త్వరలోనే బిగ్‌బాస్2 ప్రారంభం కాబోతున్నదని ప్రోమోలో వెల్లడించారు.

bigg boss2 biggboss2 nani junior ntr star maa tv బిగ్‌బాస్2 బిగ్‌బాస్2 రియాలిటీ షో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ మా టెలివిజన్


Click it and Unblock the Notifications