Unstoppable With NBK: సెకండ్ ఎపిసోడ్ కోసం నాని ఎంట్రీ...సెల్ఫ్ మేడ్ కి ఇంటిపేరుగా!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పుడు నాని దర్శనం ఇవ్వనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

 అఖండతో

అఖండతో

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. బాలకృష్ణ కెరీర్ లో మొట్టమొదటి సారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో నటిస్తున్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 టాక్ షో

టాక్ షో

అదలా ఉంచితే ఇప్పుడు బాలకృష్ణ ఒక టాక్ షో చేస్తున్నారు. మొట్టమొదటి పూర్తి స్థాయి తెలుగు ఒటీటీ అయిన ఆహా కోసం ఆయన అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో మొట్టమొదటి హోస్టింగ్ కావడంతో పాటు అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ఆహా యాప్ కోసం కావడంతో షో మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే హోస్ట్ బాలయ్య ఎనర్జీ కూడా షోని నెక్స్ట్ లెవల్ కు తీసుకుపోయింది.

 సెకండ్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా

సెకండ్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా

అలా మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ అతిథులుగా వచ్చి షో రక్తి కట్టించారు. ఇక రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురు పేర్లు వినిపించగా రెండో ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా రాబోతున్నట్లుగా ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది. మాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాధ అనే సినిమాలో బాలకృష్ణ అభిమాని గా నటించారు. ముందుగా జై బాలయ్య అనే చేతి మీద టాటూ ఉన్న ఫోటో షేర్ చేసిన ఆహా సంస్థ ఈ సారి ఎవరు రాబోతున్నారు గెస్ చేయమని ముందు కోరింది.

 సెల్ఫ్ మేడ్

సెల్ఫ్ మేడ్


ఈరోజు ఉదయం మనలో ఒకడు సెల్ఫ్ మేడ్ అనే పదానికి ఇంటి పేరు నాని మా అన్ స్టాప్ బుల్ సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ అని వెల్లడించింది. అంతే కాక వీరిద్దరికీ సంబంధించిన రెండో ఎపిసోడ్ ప్రోమో సాయంత్రం 5.04 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. వీరిద్దరూ కలిసి ఉన్న నాలుగు ఫోటోలు కూడా షేర్ చేయగా అటు ఇరువురి అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Recommended Video

RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Filmibeat Telugu
 సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక నాని సినిమాల విషయానికి వస్తే చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. మరోపక్క నాని నడుస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X