రాజమౌళిని విమర్శించేందుకు నీవెవరు? నేను చర్చికి వెళ్లా.. తప్పుపడుతావా? గోగినేనికి నాని క్లాస్

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Saturday Episode Highlights

బిగ్‌బాస్‌లో 49వ ఎపిసోడ్ చాలా హాట్‌హాట్‌గా సాగింది. కొందరు ఇంటి సభ్యుల ప్రవర్తనను ప్రశంసించిన నాని.. మరికొందరి బిహేవియర్‌పై ఫైర్ అయ్యారు. కెప్టెన్‌గా గీతామాధురి వ్యవహరించిన తీరును అభినందించారు. ప్రధానంగా బాబు గోగినేనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినంత పనిచేశారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో ఓసారి లుక్కేద్దాం..

 ఇంటి సభ్యులతో నాని మాటలు

ఇంటి సభ్యులతో నాని మాటలు

ఇంటిసభ్యులకు వచ్చిన ఫోన్ కాల్‌తో మంచి వాతావరణం కనిపించింది. మాకు కూడా మంచి ఆనందాన్ని నింపింది. మాకే ఆ ఫోన్ కాల్ వచ్చనంత సంతోషం కలిగింది అని నాని అన్నారు. అమిత్, గీతా మాధురి, బాబు గోగినేని వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడిన తీరు ఆకట్టుకొన్నదని నాని చెప్పాడు.

 బాబు గోగినేని ఇంత దారుణమా?

బాబు గోగినేని ఇంత దారుణమా?

బాబు గోగినేనితో మాట్లాడుతూ.. మీ భార్య సూచన మేరకు మీరు మీ ప్రవర్తనను మార్చుకొంటారని బాగా ఆశించాను. కానీ మీరు ఓపెన్ అప్ అయితే ఇంత దారుణంగా ఉంటుందా? ఇంట్లో మిమ్మల్ని బిగ్గర్‌బాస్ అని అనుకొంటాం. కానీ మీరేందు వాడు స్థాయి ఏంది? నాది ఇంటర్నేషన్ స్థాయి అని మీకు మీరే కితాబు ఇచ్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

నీ స్థాయి ఏంటో

నీ స్థాయి ఏంటో

ఎలాంటి వివరణ లేకుండా నాది ఇంటర్నేషనల్ స్థాయి అని చెప్పుకోవడం చాలా అభ్యంతరకరం. ఉద్రేకంగా నీవు చెప్పిన మాటలు చాలా కోట్ల మంది ప్రేక్షకుల చూశారు. ఇప్పుడు వివరణ ఇస్తే ఎలా అని ప్రశ్నించగా.. ఒకవేళ అలా తప్పుగా మాట్లాడితే సారీ చెబుతున్నాను అని బాబు గోగినేని అన్నారు.

రాజమౌళి తప్పు చేశాడు..

రాజమౌళి తప్పు చేశాడు..

ఇక రాజమౌళి మంత్రాలయానికి వెళ్లడం అనే అంశం చర్చకు రాగా.. నేను నాస్తికుడు అని రాజమౌళి చెప్పాడు. బాహుబలి తర్వాత మంత్రాలయానికి వెళ్లి పూజలు చేయడం తప్పు. నా మతం ఇది అని చెప్పి ఆయన దేవుళ్ల వద్దకు వెళితే సరిగా ఉంటుందని బాబు గోగినేని సమాధానం ఇచ్చారు. అయితే బాబు గోగినేని మాటలపై నాని అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేను చర్చికి వెళ్లా.. అది తప్పా?

నేను చర్చికి వెళ్లా.. అది తప్పా?

మా నాయనమ్మ కన్వర్టెడ్ క్రిస్టియన్. నేను నమ్మే దేవుడు వేరు. కానీ నాయన్నమ్మతో ప్రతీ ఆదివారం చర్చికి వెళ్లే వాడిని. అంత మాత్రాన నేను క్రిస్టియన్ కాదు కదా. ఫ్యామిలీ సెంటిమెంట్‌ను గుర్తించి నేను వెళ్లాను. అంతా మాత్రాన నాది తప్పవుతుందా అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా నాస్తికుడు అని చెప్పి గుడికి వెళ్లడం తప్పు అని గోగినేని అన్నాడు. హిందువును అని చెప్పి చర్చికి వెళితే ఎలా తప్పవుతుంది అని నాని నిలదీశాడు.

రాజమౌళిని అనడానికి మీరేవరు?

రాజమౌళిని అనడానికి మీరేవరు?

రాజమౌళి ఫ్యామిలీ సెంటిమెంట్‌ను గుర్తించి మంత్రాలయంలోకి వెళితే తప్పు అనడానికి మీరు ఎవరండి ? గుడిలోకి వెళితే సంప్రదాయ దుస్తులు ధరిస్తే దానిని విమర్శించడానికి.. అలా చెప్పడానికి మీరు ఎవరు? అది తప్పని చెప్పే డిక్షనరీ ఉందా అని ప్రశ్నించారు.

లీడర్లను చేసేది ప్రజలే

లీడర్లను చేసేది ప్రజలే

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ హౌస్ నుంచి కౌశల్, గీతా మాధురిని బయటకు పంపిస్తానని బాబు గోగినేని చెప్పడంపై ఫైర్ అయ్యారు. వారిని పంపించడానికి నీవెవరు? అని క్లాస్ పీకారు. అందుకు సమాధానంగా నేను లీడర్లను తయారు చేస్తుంటాను. నాయకత్వ లక్షణాలు నింపే విధంగా లెక్చర్లు ఇస్తాను అని ఏదో చెప్పబోగా.. లీడర్లను తయారు చేసే శక్తి ప్రజల చేతిలో ఉంది. ఓ వ్యక్తితో సాధ్యపడదని బాబు గోగినేనికి చురకలు అంటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X