పాపం సుధీర్‌ను అలా ఇరికించేశాడు.. నాని కూడా మామూలోడు కాదు!
బుల్లితెరపై ఉండే పోటీతత్త్వం గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా పండుగ వస్తుందంటే చాలు రకరకాల కాన్సెప్ట్‌లతో ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటారు. ప్రతీ చానెల్ ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తుంటుంది. అలా ఈ ఉగాదికి కూడా అన్ని చానెళ్లు రెడీ అయ్యాయి. ప్రేక్షకులను మెప్పించేందుకు తమ శైలిలో దూసుకువస్తున్నాయి. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వాళ్లంతా కూడా ఉగాది ఈవెంట్ ప్రోమోలతో రచ్చ చేస్తున్నారు.

ఉగాది జాతి రత్నాలు..
ఉగాది జాతి రత్నాలు అంటూ ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో సుధీర్, శ్రీముఖి, పూర్ణ, సంగీత, రష్మీ ఇలా అందరూ రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. వీరితో పాటు మనో, హైపర్ ఆది ఇలా జబర్దస్త్ టీం అంతా కూడా రెడీ అయింది.

ఆరు రకాలు అంటూ..
ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం అంటూ ఆరు రకాల గురించి చెప్పుకొచ్చారు. ఇందులో కమెడియన్స్, యాక్టర్స్, యాంకర్స్, డ్యాన్సర్స్, సోషల్ మీడియా స్టార్స్ అంటూ అందరి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఒక్కొక్కరిని ఒక్కో రుచితో పోల్చారు.

నాని స్పెషల్ గెస్ట్‌గా..
నాచురల్ స్టార్ నాని ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. టక్ జగదీష్ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఉగాది జాతిరత్నాలు ఈవెంట్‌లో దుమ్ములేపేశాడు. అయితే ఈవెంట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్‌ను ఓ రేంజ్‌లొ ఆడుకున్నారు.

ఇరికించిన ఆది..
సుధీర్‌ను నాని వద్ద హైపర్ ఆది ఇరికించేశాడు. వేప ఆకులను తినాలని, అది తింటే నాని టక్ జగదీష్ సినిమా హిట్ అవుతుందని ఆది అన్నాడు. మీ సినిమా హిట్ కావాలని ఇది తింటున్నా నాని గారు అంటూ అతి కష్టం మీద అది తినేశాడు.

నాని కూడా..
అయితే శ్యాం సింఘరాయ్ షూటింగ్ అవ్వాలని, దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అవ్వాలని.. అందుకే నువ్ ఇవ్వన్నీ తినాలని ఆది మళ్లీ ఇరికించాడు. ఇక నాని సైతం సుధీర్‌ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆది అలా అన్నాడు కాబట్టి నేను కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను.. నువ్ అవి తినాల్సిందేనని సుధీర్‌ను ఆడుకున్నారు.


Click it and Unblock the Notifications











