బిగ్ బాస్ 2: పవన్ కళ్యాణ్ సాంగ్‌తో హౌస్‌లోకి నాని ఎంట్రీ.. అరుంధతిగా తేజస్వి!
నేడు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో చాలా ప్రత్యేకలు ఉన్నాయి. ఓ వైపు ఎలిమినేషన్ ఉత్కంఠ రేపుతుంటే మరో వైపు నాని హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాని హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రోమోని బిగ్ బాస్ నిర్వాహకులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇంతకీ నాని హౌస్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.

స్వాగతం కృష్ణా
అజ్ఞాతవాసి చిత్రంలోని స్వాగతం కృష్ణా అనే సాంగ్ ప్లే అవుతుంటుంది. బిగ్ బాస్ హౌస్ గేట్లు తెరుచుకుంటాయి. నాని హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అంతే.. ఇంటి సభ్యులంతా సంతోషంలో మునిగిపోతారు.

రాఖీ స్పెషల్
నేడు రాఖీ పండుగ సందర్భంగా నాని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబందించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ లోని లేడీస్ అందరూ నానికి రాఖి కడుతున్నారు. సంతోషంతో రాఖి సంబరాలు బిగ్ బాస్ హౌస్ లో జరగనున్నాయి.

ట్రోలింగ్ గురించి
బిగ్ బాస్ సెలెబ్రిటీల గురించి బయట ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులపై వస్తున్న ఫన్నీ ట్రోలింగ్స్ ని నాని హౌస్ మేట్స్ కు చూపిస్తున్నాడు. ఆ ట్రోలింగ్స్ చూసి ఇంటి సభ్యులంతా సరదాగా నవ్వుకుంటున్నారు.

తనీష్‌పై సెటైర్
తనీష్ పై సెటైరికల్ గా ఉన్నా ఆడియన్స్ సోషల్ మీడియా పోస్ట్ చూసి అంతా నవ్వుకున్నారు. ఇక తేజస్విని అరుంధతి చిత్రంలో అనుష్కగా పోలుస్తూ, సామ్రాట్ ని చిన్న పిల్లవాడిగా చూపిస్తూ ఉన్న పోస్ట్ చాలా సరదాగా ఉంది.

పెయింటింగ్ టాస్క్
పెయింటింగ్ టాస్క్ లో దీప్తి ముఖం మొత్తం గుర్తు పట్టలేని విధంగా మారిపోయి ఉంటుంది. దీప్తిని చూసి చిన్న పిల్లవాడు భయపడుతున్న ఫోటో నవ్వులు పూయించింది. ఇంత సంతోషంలో కూడా అత్యంత ఉత్కంఠ భరితమైన ఎలిమినేషన్ ఎలా ముగిసిందో తెలియాలంటే నేడు జరగబోయే ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











