బిగ్ బాస్2: మరో షాక్ ఇచ్చిన నాని.. ఎలిమినేట్ అయిన వారిలో ఒకరు మళ్ళీ హౌస్‌లోకి!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రియాలిటీ షో విజయవంతంగా దూసుకుపోతోంది. బిగ్ బాస్ షోలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి చివరగా తేజస్వి ఎలిమినేట్ అయింది. వాస్తవానికి సామ్రాట్ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించారు. ఎలిమినేట్ అయిన వారిలో ఒకరు తిరిగి హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని నాని తాజగా షాక్ ఇచ్చాడు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది.

ఎలిమినేట్ అయినవారు మళ్ళీ
ఇప్పటి వరకు మీ ఫేవరేట్ హౌస్ సభ్యుడు ఎలిమినేట్ కాకుండా ఓటింగ్ వేశారు. ఇప్పుడు ఎలిమినేట్ అయిన మీ ఫెవరెట్ సభ్యుడిని తిరిగి హౌస్ లోకి పంపేందుకు ఓటింగ్ చేయవచ్చు అని నాని ప్రకటించాడు.

ఆరుగురు వీళ్లే
ఇప్పటి వరకు హౌస్ నుంచి సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వి ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ఒకరు తిరిగి హౌస్ లోకి ప్రవేశించే అవకాశం దక్కింది. కానీ నిర్ణేతలు మాత్రం ఆడియన్సే.

సంజన
హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి సభ్యురాలు సంజన. తొలి రోజు నుంచే సంజనపై ఆడియన్స్ లో నెగిటివ్ ప్రచారం మొదలైంది. సంజనకు ఆడియన్స్ ఓటింగ్ చేస్తారో లేదో చూడాలి.

కిరీటి, నూతన్ నాయుడు
ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ కాగా వారిలో ఇద్దరు మాత్రమే పురుషులు ఉన్నారు. నూతన్ నాయుడు, కిరీటి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలోసామాన్యుడు అయిననూతన్ నాయుడు పట్ల ఆడియన్స్ లో సింపతీ ఉంది. ఓటింగ్ విషయంలో ఇది అతడికి కలసి వచ్చే అంశం.

శ్యామల
ప్రముఖ యాంకర్ గా హౌస్ లోకి ప్రవేశించిన శ్యామలపై ఆడియన్స్ లో ఎటువంటి చెడు ఒపీనియన్ లేదు. శ్యామలతో పాటు నామినేట్ అయిన దీప్తి, నందినిని.. తేజస్వి,కౌశల్ రక్షించడంతో శ్యామల బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఓటింగ్ విషయంలో శ్యామలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి.

భానుశ్రీ, తేజస్వి
కౌశల్ తో వివాదం భానుశ్రీపై చెడు ప్రచారం ఎక్కువయ్యేలా చేసింది. ఇక తేజస్వి ప్రతి విషయంలోనూ యాక్టివ్ గా ఉన్నప్పటికీ హౌస్ సభ్యులతో చాలా వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ ఎవరివైపు మొగ్గు చూతారో అనే విషయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఓటింగ్ నేడు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











