బిగ్ బాస్2: బాబు తరువాత ఆ ముగ్గురే.. నాని మాటలతో గుండెల్లో గుబులు, సింపతీతో ఎన్ని రోజులు!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో పెద్దమనిషిగా ఉన్న బాబు గోగినేని ఎలిమినేటి కావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. హౌస్ లో ఇక ఎలాంటి సింపతీ పనిచేయదని పెర్ఫామెన్స్ ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందని బాబు గోగినేనితో అర్థం అయిపోయింది. నాని వ్యాఖ్యలతో బాబు గోగినేని తరువాత హౌస్ లో ఎలిమినేటి కాబోతున్న వ్యక్తి గురించి అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

కారణం అదే
బాబు గోగినేని హౌస్ లో ఉన్న అందరి సభ్యుల కంటే వయసులో పెద్ద. అందుకు అన్ని టాస్క్ లలో ఆయన యాక్టీవ్ గా పాల్గొనలేదు. కానీ ఆయన అందరితో కలిసిపోవడం, ఏదైనా చర్చ జరిగినప్పుడు బలంగా తన వాయిస్ వినిపించడంతో ఇన్నిరోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగగలిగారు. ఆదివారం రోజు బాబు ఎలిమినేట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది.

ఊహాగానాలు
నాని బిగ్ బాస్ లో ఇటీవల చేసిన వ్యాఖ్యలతో బాబు గోగినేని తరువాత ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముగ్గురు సభ్యులకు నాని ఇచ్చిన వార్నింగ్ ప్రకారం నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఆ ముగ్గిరిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నామినేషన్ స్టార్
శనివారం రోజు గణేష్ తో మాట్లాడుతూ అతడిని నాని నామినేషన్ స్టార్ అని అభివర్ణించాడు. నాకు ఆడియన్స్ లో సింపతీ ఉంది. దీనితో నెట్టుకురావచ్చులే అని అనుకుంటున్నావా అంటూ నాని గణేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. టాస్క్ లలో ఎక్కడ కనిపించడం లేదని వార్నింగ్ ఇచ్చాడు.

సేఫ్ గేమ్
గణేష్ తో పాటు నాని మరో ఇద్దరికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. రోల్ రైడ, అమిత్ లకు కూడా నాని చురకలు అంటించాడు. మీరిద్దరూ హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నారని వారి లోపాలని ఎత్తిచూపాడు.

ఇదే పరిస్థితి
గణేష్, రోల్ రైడ, అమిత్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బంది తప్పదంటూ ఎలిమినేషన్ గురించి చెప్పకనే చెప్పాడు. దీనితో వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కదం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

ఆ నలుగురే
ఇక హౌస్ లో ప్రధాన పోటీ నలుగురు సభ్యుల మధ్యే నెలకొని ఉంది. కౌశల్ కు ఆడియన్స్ నుంచి మంచి మద్దత్తు లభిస్తోంది. గీత మాధురి సమయ స్పూర్తితో వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు. తనీష్, టీవీ9 దీప్తి ప్రతి టాస్క్ లో తీవ్రమైన పోటీ ఇస్తూ రేసులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











