twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్థరాత్రి తనీష్, నందిని రొమాన్స్.. షాకైపోయిన నాని, బాబుని ఒక ఆట ఆడుకున్నాడు!

    |

    నాని ఎంట్రీ ఇచ్చే శని, ఆదివారాలు బిగ్ బాస్ షో ఒక రేంజ్ లో సాగుతోంది. వారం మొత్తం ఇంటి సభ్యులు చేసిన తప్పులు నిలదీస్తూ నాని ముందుకు సాగుతున్నాడు. హోస్ మేట్స్ ని మందలించే విషయంలో నాని పరిణితి ప్రదర్శిస్తున్నాడు. శనివారం జరిగిన ఎపిసోడ్ రంజుగా మారింది. కౌశల్, గీతా మాధురి, బాబు గోగినేని మధ్య హాట్ హాట్ గా వివాదం వారం మొత్తం కొనసాగింది. దానిని నాని సెట్ రైట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో చురకలు అంటించాల్సి వారికి నాని గట్టిగానే సమాధానం చెప్పాడు.

    ఈ వారం ఇదే తంతు

    ఈ వారం ఇదే తంతు

    గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం వేడెక్కింది. దానికి కారణం హౌస్ లో పెద్దమనిషి పాత్ర పోషించే బాబు, పెద్దక్కగా ఉన్న గీత, ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేస్తున్న కౌశల్ మధ్య వివాదం చెలరేడమే.

    రాజమౌళిపై వ్యాఖ్యలు

    రాజమౌళిపై వ్యాఖ్యలు

    బాబు గోగినేని రాజమౌళిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గీత, కౌశల్ ని ఎలిమినేట్ చేయిస్తా అంటూ ఘాటుగా మాట్లాడడం వీరు ముగ్గురి మధ్య వివాదంగా మారింది. వీటన్నింటిని నాని క్షుణ్ణంగా గమనించినట్లు ఉన్నాడు.

    ఆడేసుకున్న నాని

    ఆడేసుకున్న నాని

    శనివారం రోజు ఈ వివాదం విషయంలో బాబు గోగినేనితో నాని ఓ ఆట ఆడేసుకున్నాడు. రాజమౌళి మంత్రాలయం గుడికి వెళ్ళితే మీకు వచ్చిన నష్టం ఏంటి అని బాబుని నాని సూటిగా ప్రశ్నించాడు. ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్న మీరు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం కరెక్టేనా అని నాని బాబుకు చురకలు అంటించాడు.

    డిసైడ్ చేసేది మీరేనా

    డిసైడ్ చేసేది మీరేనా

    గీత, కౌశల్ ఎలిమినేషన్ గురించి బాబు చేసిన వ్యాఖ్యపై నాని స్పందించాడు. ఒకరిని హౌస్ లో ఉంచేలా, బయటకు పంపాలా అనేది నిర్ణయించేది మీరు కాదు .. ప్రేక్షకులు, అది గుర్తుపెట్టుకోండి బాబు గారు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.

    తనీష్ కొత్త వ్యవహారం

    తనీష్ కొత్త వ్యవహారం

    బిగ్ బాస్ హౌస్ లో తనీష్, సునైనా వ్యవహారం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ విషయంలో ఫోన్ కాల్ ద్వారా తనీష్ తల్లే అతడికి చురకలు నటించింది. తాజాగా హౌస్ లో మరో రొమాన్స్ మొదలైంది.

    అర్థరాత్రి రొమాన్స్

    అర్థరాత్రి రొమాన్స్

    అర్థరాత్రి సమయంలో సభ్యులు అందరూ పడుకున్నాక తనీష్, నందిని ఒంటరిగా మాట్లాడుకున్నారు. నందిని, తనీష్ కలసి అర్థరాత్రి సమయంలో గుసగుసలు మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. చివర్లో నందిని వెళుతూ హగ్ కావాలా అంటూ తనీష్ కి ఆఫర్ ఇవ్వడం.. తనీష్ హగ్ తో పాటు కిస్ కూడా చేయడం హాట్ టాపిక్ గా మారింది.

    బాగా పులిహోర

    బాగా పులిహోర

    ఈ విషయాన్ని నాని సరదాగా చెబుతూనే తనీష్ కు తలంటు పోసాడు. పాంపర్ చేయవద్దని అమ్మ చెబితే మరొకరితో టాంపరింగ్ మొదలు పెట్టమని కాదు అంటూ నాని తెలిపాడు. ఒకరోజు మొత్తం తనీష్ నోటికి ప్లాస్టర్ అంటించుకోవాలని శిక్ష విధించాడు.

    English summary
    Nani gives strong warning to Babu Gogineni. Tanish, Nandini romance became hot topic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X