బిగ్‌బాస్ నుంచి ఎన్టీఆర్ ఎందుకు తప్పుకొన్నారంటే.. ఈసారి ఇంకొంచెం మసాలా: నానీ!
Recommended Video

తెలుగులో మొదటిసారి రూపొందించి ప్రసారమైన బిగ్‌బాస్ రియాలిటీ షోకు విశేష స్పందన లభించింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి టెలివిజన్ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా రేటింగ్ వచ్చింది. అయితే రెండో సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉంటారని ఆశించిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. అయితే నాని హోస్ట్‌గా వస్తున్నారనగానే మరింత ఆసక్తిని రేపింది. ఎన్టీఆర్ ఎందుకు తప్పుకొన్నారనే విషయం మీడియాలో చర్చానీయాంశమైంది. ఆ వివరాలు మీ కోసం..

షూటింగ్ బిజీలతో
బిగ్‌బాస్ కోసం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాలంటే దాదాపు 100 రోజులకు పైగా డేట్స్ కేటాయించాలి. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే చిత్రంతోపాటు, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. అందుకే ఎన్టీఆర్ ఈ షో నుంచి తప్పుకొన్నట్టు సమాచారం.

నాని హోస్ట్‌గా
బిగ్‌బాస్2 కోసం నేచురల్ స్టార్ నానిని హోస్ట్‌గా స్టార్ మా టెలివిజన్ ఎంపిక చేసింది. రెండో సీజన్‌కు సంబంధించిన ప్రోమో ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.

ఎన్టీఆర్‌తోనే క్రేజ్
బిగ్‌బాస్ తొలి సీజన్‌కు విపరీతమైన క్రేజ్ రావడానికి కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం కాదనలేని సత్యం. ఎన్టీఆర్ కారణంగానే రెండో సీజన్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హోస్ట్‌గా నానితో రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

ఆసక్తికరంగా ప్రోమో
బిగ్‌బాస్2 ప్రోమోను చాలా ఆసక్తికరంగా రూపొందించారు. గ్యాంగస్టర్ కోపంతో హోస్ట్ ఎవడురా? ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలిరా అంటూ ఓ వ్యక్తికి తుపాకి గురిపెట్టి వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతలో నాని అన్న అంటూ ఓ పిల్లాడు పరుగెత్తుకొంటూ వస్తాడు.
అదరగొట్టిన నాని
ప్రోమోలో నాని ఎంట్రీని చాలా బాగా చిత్రీకరించారు. ఈ సారి కొంచెం మసాలా అంటూ నాని డైలాగ్‌తో అదరగొట్టాడు. ఏదైనా జరగొచ్చు అంటూ నాని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

100 రోజులపాటు
బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కూడా 16 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. సామాన్య ప్రేక్షకులకు ఈ సారి షోలో భాగస్వామ్యం చేయడం ప్రత్యేకత. దాదాపు 100 రోజులపాటు బిగ్‌బాస్2 ప్రసారం కానున్నది.

బిగ్‌బాస్ రికార్డు ఇదే
తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందే కార్యక్రమంగా బిగ్‌బాస్ తెలుగు ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ కార్యక్రమం జూన్ 10న ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. స్టార్ మా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నది.


Click it and Unblock the Notifications











