మరణం అంచుల దాకా నాని.. ప్రమాదంలో కూడా ఫ్రెండ్ కోసం.. దారుణమైన యాక్సిడెంట్

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Nani Revealed His Personal Incident

బిగ్‌బాస్ హౌస్‌లో ఆగస్టు 5వ తేదీన ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్ భారీగా జరిగాయి. సినిమాల్లోకి రాకముందు నాకు ఫ్రెండ్స్ ఎక్కవే. సినిమాలోకి వచ్చిన తర్వాత జీవితమే సినిమా అయిపోయింది. ఆ తర్వాత మ్యారేజ్, ఫ్యామిలీతో బిజీ అయిపోయాను. చాలా రోజుల తర్వాత వీకెండ్ ఫ్రెండ్స్ మీరే అంటూ నాని అన్నారు. ఫ్రెండ్ షిప్ గురించి విలువను.. ఎమోషన్ చెబుతూ ఓ చేదు సంఘటను చెప్పి ఉద్వేగానికి గురిచేశాడు. ఓ రోజు జరిగిన కారు యాక్సిడెంట్ గురించి వివరంగా చెబుతూ ఫ్రెండ్ షిప్ ఎమోషన్ అంతర్లీనంగా ఎలా వర్కవుట్ అవుతుందో ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆ దారుణమైన సంఘటన ఏంటంటే..

హైదరాబాద్‌ నుంచి అంతర్వేదికి

హైదరాబాద్‌ నుంచి అంతర్వేదికి

హైదరాబాద్ నుంచి అంతర్వేది వెళ్తున్న క్రమంలో జరిగిన యాక్సిడెంట్ ఘటనను గుర్తు చేసుకొంటూ.. నేను నటుడిని అయ్యాక రెండో సినిమా షూటింగ్‌ జరుగుతున్నపుడు.. స్నేహితులతో గడపడానికి సమయం దొరకడం లేదు. ఎలాగోలా టైమ్ అడ్జెస్ట్ చేసుకొని అంతర్వేదిలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేద్దామని బయలుదేరాం. సరదాగా వెళ్తుంటే ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు అని నాని చెప్పాడు.

రోడ్డుపై పాత లారీ

రోడ్డుపై పాత లారీ

కారులో ఐదుగురు వెళ్తున్నాం. కారులో ముగ్గురు వెనుక సీట్లో కూర్చొన్నారు. ముందు సీట్లో నా ఫ్రెండ్ ప్రశాంత్. డ్రైవర్ సీట్లో నేను కూర్చొన్నాను. రాత్రి కారులో ప్రయాణిస్తున్నాం. అలా జర్నీ చేస్తుండగా.. మధ్యలో రోడ్డుపై నిలిచిపోయిన ఓ పాత లారీ ఉంది. దాని చుట్టు ఓ రాళ్లు, ఆకులు, కొమ్మలు పెట్టారు. ఓ మలుపు తర్వాత ఉండటంతో లారీ కనిపించలేదు.

వేగంగా లారీని ఢీకొట్టిన కారు

వేగంగా లారీని ఢీకొట్టిన కారు

మేము వెళ్తున్న కారు మలుపు తిరిగే సరికి హఠాత్తుగా లారీ కనిపించింది. అదుపు చేయలేనంత సమయం లేకపోవడంతో లారీని కారు ఢీకొట్టింది. లారీ ముందు భాగం నా ముఖం వరకు వచ్చింది. అద్దాలు పగిలిపోయి చేతులకు గాయాలయ్యాయి.

 రక్తం ధారళంగా కారుతుంటే

రక్తం ధారళంగా కారుతుంటే

నా గదవ కింది భాగంలో కట్ రక్తం కారిపోతుంది. నాకు ఏ చేయాలో అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుంతో తెలియని ఓ మైకం. పొగ, దుమ్ము కమ్ముకుపొయింది. డోర్లు ఓపెన్ కావడం లేదు. ఏవోవో మాటలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగిందని రోడ్డుపైన వెళ్తున్న వాళ్లు వచ్చి చూసి వెళ్తున్నారు. అంతలో నా వెనక ఉన్న నా ఫ్రెండ్స్ ప్రశాంత్.. ప్రశాంత్.. ప్రశాంత్ అని ముందు కూర్చున్న నా ఫ్రెండ్ గురించి అరుస్తున్నారు.

ప్రశాంత్ పేరు వినగానే

ప్రశాంత్ పేరు వినగానే

నా చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత్ పేరు వినగానే ఒక్క సెకన్‌లో హోష్ వచ్చింది. అప్పుడే నాకు షాక్ తగిలినంత పనైంది. అప్పుడే నాలో ఉన్న శక్తి బయటకు వచ్చింది. నా శరీరంలో రక్తప్రసరణ 100 రెట్లు పెరిగింది. ఎలా కారు నుంచి బయటకు వచ్చానో నాకే తెలియదు. కారు చుట్టు తిరిగి వచ్చి ప్రశాంత్‌.. ప్రశాంత్ అని అరిచాను.

నేను స్పృహ కోల్పోయి

నేను స్పృహ కోల్పోయి

ప్రశాంత్ కారు ముందు సీట్లో ఉండిపోయాడు. డోర్ లాగి ప్రశాంత్‌ను బయటకు లాగి చేతిలోకి తీసుకొన్నాను. ఆ తర్వాత ప్రశాంత్ అని గట్టిగా అరిచాను. అప్పుడు ప్రశాంత్ ఒక్కసారి కుదుపుతో లేచాడు. ప్రశాంత్ లేచాడు.. వెంటనే నేను స్పృహ కోల్పోయి కిందపడిపోయాను.

లాజిక్కుల కతీతంగా ఫ్రెండ్ షిప్‌

లాజిక్కుల కతీతంగా ఫ్రెండ్ షిప్‌

అప్పటి వరకు ఏదో నన్ను ఆపినట్టు అనిపించింది. నా చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత్‌కు ఏమైపోయిందనే నాలోని ఆవేదన నాలో శక్తిని కూడగట్టిందేమో. సైన్స్, లాజిక్స్‌లకు అతీతంగా ఫ్రెండ్ షిప్ ఉందని చెప్పడానికి.. నా జీవితంలో జరిగిన ఓ దారుణమైన సంఘటనను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అని నాని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X