twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌కు అరుదైన రికార్డు.. తేజస్వి ఎలిమినేషన్‌తో.. షోను నిలబెట్టిన నాని!

    By Rajababu
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Bigg Boss Show Ratings Increases

    టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ విషయంలో బిగ్‌బాస్ సత్తా చాటుతున్నది. తెలుగు బిగ్‌బాస్2 రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న స్టార్ మా టెలివిజన్ సంస్థను అగ్రస్థానంలో నిలిపింది. బిగ్‌బాస్ రెండో సీజన్‌, హోస్ట్‌గా నాని అంతగా ఆకట్టుకోలేకపోతున్నదనే విమర్శలకు చెక్ పెట్టింది. వివరాల్లోకి వెళితే..

    తేజస్వి ఎలిమినేషన్‌తో

    తేజస్వి ఎలిమినేషన్‌తో

    ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తొలి సీజన్‌తో పోల్చుకొంటే ఆరంభంలో రెండో సీజన్‌కు పెద్దగా ఆదరణ లేదు. కానీ తేజస్వి, భానుశ్రీ ఎలిమినేషన్ల ముందు జరిగిన ఎపిసోడ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చిందని ర్యాంకింగ్ పాయింట్లు స్పష్టం చేస్తున్నాయి.

     నాని లోపాల సవరణ

    నాని లోపాల సవరణ

    హోస్ట్‌గా నాని లోపాలను సవరించుకొని బిగ్‌బాస్ షోను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ అందుకు నిదర్శనం చెప్పవచ్చు. ఆదివారం రోజున ప్రసారమైన ఎపిసోడ్‌కు మంచి రేటింగ్ వచ్చింది.

    మంచు లక్ష్మీ, ప్రదీప్ బూస్ట్

    మంచు లక్ష్మీ, ప్రదీప్ బూస్ట్

    గత వారాంతంలో వైఫ్ ఆఫ్ రామ్ ప్రమోషన్ కోసం మంచు లక్ష్మీ రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే స్టార్ యాంకర్ ప్రదీప్ మాచినేని కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అతిథిగా ప్రవేశించడం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. తేజస్వి ఎలిమినేషన్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ తిరిగి వచ్చారనే కామెంట్ వినిపిస్తున్నది.

    రికార్డు పాయింట్స్

    రికార్డు పాయింట్స్

    బిగ్‌బాస్ వీకెండ్ ప్రసారానికి 11 టీవీఆర్ పాయింట్లు రావడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. అలాగే బిగ్‌బాస్ రేటింగ్ 6.5 నుంచి 6.8 పాయింట్లతో మెరుగుపడింది. దీంతో 906 జీఆర్పీ పాయింట్లతో స్టార్ మా తెలుగు టెలివిజన్ రంగంలో నంబర్ 1గా నిలిచింది.

     అండగా నిలిచిన సీరియల్స్

    అండగా నిలిచిన సీరియల్స్

    బిగ్‌బాస్‌కు తోడుగా స్టార్ మా టెలివిజన్‌లో కార్తీక దీపం, కుంకుమ పువ్వు, కోయిలమ్మ సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

    English summary
    Bigg Boss is emerging as a crazy TV show on the small screen in Telugu. Sunday episode recorded a record rating. BIGG BOSS has improved from 6.5 to 6.8 tvr. Sunday episode delivered 11 tvr. Star Maa No.1 with Highest-Ever 906 grps
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X