కౌశల్‌ను టచ్ చేసి చూడు.. నీవేమైనా రౌడీవా? బయటైతే లోపలేస్తారు.. తనీష్‌పై భగ్గుమన్న నాని

బిగ్‌బాస్‌లో చివరి రెండో వారం గందరగోళం మధ్య, ఉద్విగ్న వాతావరణంతో ముగిసింది. ఆదివారం కీలకమైన ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు కాబోతున్నది. ఈ ప్రక్రియ ఎంత కీలకమైందంటే.. ఈ వారం ఎలిమినేషన్ తర్వాత మిగితా సభ్యులందరూ ఫైనల్‌కు వెళ్లబోతున్నారు. కాబట్టి చివరి వారం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారబోతున్నది. శనివారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ఏమి జరిగిందంటే..

 నాని భావోద్వేగంతో

నాని భావోద్వేగంతో

శనివారం ఇంటి వేదికపైకి రాగానే చాలా భావోద్వేగానికి లోనయ్యారు. మన జీవితంలోకి కొందరు వచ్చి పోతుంటారు. వాళ్లు మనపై ఓ ప్రభావాన్ని, తీపి, చేదు గుర్తులు వదిలి వెళ్తారు. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ ముగింపుకు వచ్చింది అని నాని అన్నారు.

సభ్యులకు బిగ్‌బాస్ గిఫ్టులు

సభ్యులకు బిగ్‌బాస్ గిఫ్టులు

గత 100కు పైగా రోజుల్లో ఇంటిలో అత్యంత ధైర్య సాహాసాలు, శ్రమ, త్యాగాలను చేసిన సభ్యులను బిగ్‌బాస్ ప్రశంసించారు. వారి అంకితభావానికి సూచనగా వారికి ప్రముఖ దస్తులు కంపెనీ ఇచ్చిన గిఫ్టులను అందజేశారు. ఇంటిలో అందరికి కలిసి ఒకరికి గిఫ్టులను అందజేయడం గమనార్హం. చివరి వారం నేను కోపంతో మీ మీద ఇలా మాట్లడవద్దని అనుకొన్నాను. కానీ తప్పడం లేదు.

 దీప్తి నల్లమోతుకి ఝలక్

దీప్తి నల్లమోతుకి ఝలక్

ఇక ఇంటిలో దీప్తి నల్లమోతుకు బిగ్‌బాస్ ఝలక్ ఇచ్చారు. దీప్తి నీవు.. నీ మైక్‌నే ధరించు అని పేర్కొన్నాడు. దాంతో దీప్తి షాక్ తిన్నది. ఇంతకీ తాను ధరించిన మైక్ ఎవరిదని చూసుకోగా అది కౌశల్‌ది అని తేలింది.

కౌశల్‌పై అరవడం సరికాదు

కౌశల్‌పై అరవడం సరికాదు

ఇంటి సభ్యులను సమావేశ పరిచి వారితో నాని మాట్లాడుతూ కొన్ని విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు జరిగితే నేను పాయింట్ చేసేవాడిని. కానీ కౌశల్‌పై అలా అరవడం సరికాదు. ఒక్కడు మాట్లాడితే ఐదుగురు ఒకేసారి మాట్లాడితే కౌశల్ మాట్లాడేది అర్థం కాని పరిస్థితి.

తనీష్ నీవేమైనా రౌడీవా?

తనీష్ నీవేమైనా రౌడీవా?

కౌశల్ కుక్కల కామెంట్ విషయంలో తనీష్‌పై నాని భగ్గుమన్నాడు. ఇదే బయట జరిగితే తనీష్ ఏం చేస్తావు?.. నిన్ను, కౌశల్‌ను బిగ్‌బాస్ బయటకు తీసుకొస్తాను. నీవు కౌశల్‌న టచ్ చేసి చూడు. నీవేమన్నా రౌడీవా అని నాని దుమ్ముదులిపాడు. నీలో ఉన్న లోపాన్ని నీవు సరిదిద్దుకోలేకపోతున్నావని నాని హెచ్చరించాడు.

 బయటైతే లోపల పడేస్తారు

బయటైతే లోపల పడేస్తారు

కౌశల్‌తో జరిగిన ఘటన బయట జరిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇంట్లో జరిగితే ఎక్కువలో ఎక్కువగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తారు. అదే బయట జరిగితే లోపల (జైల్లో) పడేస్తారు. నీకు ఆ విషయం తెలుసా? నీలో ఉండే టెంపర్ ఏ మాత్రం తగ్గించుకోలేకపోయావు. సెలబ్రిటీలుగా మిమ్మల్ని పంపిస్తే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అని నాని నిలదీశాడు.

 దీప్తి, సమ్రాట్‌కు నాని ప్రశంస

దీప్తి, సమ్రాట్‌కు నాని ప్రశంస

ఇక దీప్తి నల్లమోతు ఆటతీరును నాని ప్రశంసించారు. మొదటి రోజు నుంచి 100 రోజుల వరకు మీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. టాస్కుల విషయంలో కూడా బాగా ఆడుతున్నావు అని నాని అన్నారు. ఫినాలేకి వెళ్లిన సామ్రాట్‌ను నాని అభినందించాడు. కానీ కౌశల్‌పై ప్రవర్తించిన తీరుపై కొంత అసహనం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X