BiggBoss Telugu 7:అంబటి అర్జున్ గెలిస్తే నాగార్జున గెలిచినట్లేనంటున్న నాని..వీరిద్దరి మధ్య ఉన్న లింకేంటి బాసూ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 13వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ముఖ్యంగా ఈ సీజన్ అంతా ఉల్టాపుల్టా అనే కాన్సెప్ట్ తో రసవత్తరంగా సాగుతోంది. మొదటగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టగా... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదో వారంలో మరో ఐదుగురిని ఇంట్లోకి పంపాడు బిగ్ బాస్. వీరితో పాటు అంతకు ముందు వారాల్లో ఎలిమినేట్ అయిన మరో అమ్మాయిని రీఎంట్రీ ఇప్పించారు. ఆమే రతికా రోజ్.

అద్భుతమైన టాస్క్ లతో పాటు అంతకు మించిన ట్విస్ట్ లు ఇస్తూ బిగ్ బాస్ షోను మరింత అద్భుతంగా మలుస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ కు చెందిన వారిని కాపాడుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే శోభాశెట్టిని, అమర్ దీప్ ను, ప్రియాంక జైన్ ను, అంబటి అర్జున్ ను కాపాడుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదంతా ఇలా ఉండగా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా గెలిచి చరిత్ర సృష్టించాడు.

Nani Shocking Comments on Ambati Arjun Winning in Bigg Boss Telugu 7 Check Details

ఎవరి సాయం లేకుండా ఆయన స్వయంగా కష్టపడి ఫినాలే అస్త్రను గెలవడంతో ఆయన గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయన అది గెలుచుకునే వరకు ఈ వారం ఆయన ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. ఓటింగ్ లిస్ట్ చూసిన అదే తెలిసింది. కానీ ఆయన ఎవరి సాయం లేకుండా ఫినాలే అస్త్ర గెలవడంతో ఓటింగ్ పెరిగిపోతూ వచ్చింది. ఆయన క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోయింది. అయితే ఆయన ప్రస్తుతం టాప్ 5కి వెళ్లే మొదటి కంటెస్టెంట్ అయ్యాడు.

ఈక్రమంలోనే వీకెండ్ ఎపిసోడ్స్ లో భాగంగా నాగార్జున అంబటి అర్జున్ కు ఫినాలే అస్త్రను అందజేశాడు. ఇక ఈరోజుటి ప్రోమోలో బిగ్ బాస్ షోకు నాచురల్ స్టార్ నాని వచ్చాడు. హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన బిగ్ బాస్ స్టేజీపైకి అడుగు పెట్టాడు. ఈక్రమంలోనే అంబటి అర్జున్ ను పరిచయం చేశాడు నాగార్జున. చాలా కామెడీ చేస్తూనే ఈయన పూర్తి పేరు చెప్పాడు.

ముఖ్యంగా అంబటి అర్జున్ పూర్తి పేరు అంబటి నాగార్జున అని నాగార్జున.. నాచురల్ స్టార్ నానికి చెప్పాడు. అది విన్న నాని అవునా అని అంటూనే.. ఈ సీజన్ విన్నర్ గా నీవు గెలిస్తే.. విన్నర్ నాగార్జున అవుతాడని, అలాగే హోస్ట్ కూడా నాగార్జుననే అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు అంబటి అర్జున్ కూడా స్పందించి తాను గెలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X