బిగ్‌బాస్‌లో తనీష్ వెధవ పనులు.. ఎలిమినేట్ అయితే హ్యాపీగా ఫీలవుతా.. నాని
బిగ్‌బాస్ ఇంటిలో రాఖీ పౌర్ణమి పండుగ చాలా ఉత్సాహంగా జరిగింది. నాని ఇంట్లోకి ప్రవేశించి అందర్నీ పేరు పేరున పలుకరించాడు. సెలబ్రిటీల ఇంటి నుంచి తెచ్చిన రాఖీలను ఆయా సభ్యులకు అందజేశాడు. ఆ తర్వాత ఇంటి సభ్యుల చేత రాఖీ కట్టించుకొన్నాడు. అనంతరం తన ఇంటి నుంచి తయారు చేయించి తీసుకొచ్చిన వంటకాలను స్వయంగా వడ్డించాడు. అనంతరం ఇంటి సభ్యుల గురించి, వారి బలాలు, బలహీనతల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన మిత్రుడు, ఇంటి సభ్యుడైన తనీష్ గురించి మాట్లాడుతూ నాని ఏమన్నారంటే...

తనీష్ మెచ్యూర్డ్‌గా బిహేవ్
బిగ్‌బాస్ ఇంట్లో తనీష్ పెద్దగా కనిపించాడు. చాలా సిల్లీపనులు చేశాడు. అవన్నీ పక్కన పెడితే చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు. ఇంటి సభ్యులకు బ్రహ్మండమైన సలహాలు ఇస్తుంటాడు. ఓ పెద్ద అన్నలా సలహాలు ఇవ్వడం నాకు బాగా నచ్చింది.
Recommended Video


తనీష్ ఎలిమినేట్ అయితే
బిగ్‌బాస్ ఇంట్లో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అయితే నాకు చాలా బాధ కలుగుతుంది. నాకు తెలిసి తనీష్ ఎలిమినేట్ అయితే తక్కువ బాధపడే వాడిని నేనే అనుకొంటాను.

తలనొప్పి తగ్గుతుంది
తనీష్ బిగ్‌బాస్ నుంచి బయటకు వెళితే నాకు తలనొప్పి తగ్గుతుంది. అమ్మయ్య వీడు వెళ్లిపోయాడు రా అని అనుకొంటాను. ఎందుకంటే తనీష్‌కు అనుకూలంగా వ్యవహారిస్తాడు అనే అపవాదు నాపై నుంచి తొలుగుతుంది.

తనీష్ వెళ్లిపోతే సమస్యలు ఉండవు
తనీష్ వెళ్లిపోతే నా షోను బ్రహ్మండంగా నడిపించుకొంటాను. నాకు ఎలాంటి సమస్యలు ఉండవు. చాలా హ్యాపీగా ఉంటుంది అని తనీష్‌ను ఉద్దేశించి సరదాగా మాట్లాడారు.

పూజా రాంచంద్రన్ అవుట్
ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ పూజా రాంచంద్రన్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆమె వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ మధ్యలోనే ఎలిమినేట్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications











