Hi Nanna: హీరో నానికి బిగ్ షాక్.. ఆ చిన్న సినిమాల కంటే తక్కువగా!

నేచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్పెషల్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రతి సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా మూవీలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా గత ఏడాది 'దసరా'తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఆ వెంటనే 'హాయ్ నాన్న' అనే సినిమాను చేశాడు.

శౌర్యూవ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమానే 'హాయ్ నాన్న'. ఈ మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే రెస్పాన్స్ భారీగా రావడంతో కలెక్షన్లు ఫుల్‌గా వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఇలా మూడు వారాల పాటు ఈ చిత్రం రాణించి హిట్ స్టేటస్‌తో పాటు లాభాలను సొంతం చేసుకుంది.

Nani Starrer Hi Nanna Movie Gets Low TRP Rating in First Telecast

ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన 'హాయ్ నాన్న' సినిమా థియేటర్లలో సక్సెస్ అయింది. దీంతో నెల రోజుల తర్వాత దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇందులో థియేటర్లలో మాదిరిగా కాకుండా ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోని బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇలా చాలా వారాల పాటు టాప్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్‌తో బంపర్ హిట్ అయిన 'హాయ్ నాన్న' మూవీని కొద్ది రోజుల క్రితమే జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం చేశారు. అయితే ఊహించని విధంగా బుల్లితెరపై దీనికి ప్రేక్షకుల నుంచి తక్కువ స్పందనే లభించింది. దీంతో ఈ సినిమాకు నాని కెరీర్‌లోనే చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్‌ నమోదు అయింది.

Nani Starrer Hi Nanna Movie Gets Low TRP Rating in First Telecast

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'హాయ్ నాన్న' చిత్రానికి అర్బన్ ఏరియాలో 4.45 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 4.06 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల కంటే తక్కువ రేటింగే అని చెప్పాలి. నాని గత చిత్రాలతో పోల్చుకున్నా ఇది చాలా అంటే చాలా తక్కువ రేటింగ్ అని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X