బిగ్‌బాస్2ను మొదలుపెట్టిన నాని.. జాబితాలో సెన్సేషనల్ సెలబ్రిటీలు!
టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు తొలి ఎడిషన్‌కు అద్బుతమైన రెస్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమాన్ని తారక్ చక్కగా ముందుకు నడిపించాడు. అయితే పలు కారణాల వల్ల బిగ్‌బాస్2 షోకు యంగ్ టైగర్ దూరంగా ఉన్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారని గత కొద్దికాలంగా మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది.
Recommended Video


నానితో ప్రోమోల షూట్
బిగ్‌బాస్ రియాలిటీ షోను రూపొందిస్తున్న స్టార్ మా సంస్థ కొద్దిరోజులుగా ప్రముఖ సినీ స్టూడియోలో దీనికి సంబంధించిన ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తున్నారు. తాజాగా నానితో ప్రమోను షూట్ చేస్తున్నారు.

నానిపై పెరిగిన అంచనాలు
జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా అటెన్షన్ పెరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ మరోస్థాయికి తీసుకెళ్లిన క్రమంలో నాని ఎలా చేస్తాడో అనే విషయం చర్చనీయాంశమైంది.

సెలబ్రిటీల ఎంపిక షురూ
బిగ్‌బాస్2లో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే విషయంపై ఆసక్తి పెరుగుతున్నది. వివాదాలతో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి, మాధవీలత, య్యూట్యూబ్ సెన్సేషన్ టీఎన్నాఆర్ లాంటి వారిని పరిగణనలోకి తీసుకొంటున్నట్టు సమాచారం. అలాగే రష్మీ, మరి కొందరు టీవీ యాంకర్లు ఇప్పటికే ఇంటర్వ్యూలకు హాజరైనట్టు సమాచారం. దాదాపు 30 మంది సెలబ్రిటీలను ఎంపిక చేసి వారిని తుది జాబితాను సిద్ధం చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.

మల్టీస్టారర్ చిత్రంలో నాని
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి తాజాగా కృష్ణార్జున యుద్ధం చిత్రంతో ఓ ఫ్లాప్ ఎదురైంది. ప్రస్తుతం నాగార్జున అక్కినేనితో కలిసి ఓ మల్టిస్టారర్ మూవీలో నాని నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్2 కార్యక్రమంపై కూడా దృష్టిపెట్టారు.


Click it and Unblock the Notifications











