రోల్.. నీకు అంత దమ్ముందా? కౌశల్ నీవు దారుణం.. నాని ఫైర్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్‌బాస్ 96, 97వ రోజు షోలో హాట్‌హాట్‌గా నాని ఫైర్ అయినట్టు ప్రోమో వదిలారు. వారాంతం ఎపిసోడ్ కావడం, అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండటం శనివారం ప్రసారమయ్యే సాధారణంగానే ఆసక్తి ఉంటుంది. దానికి తోడు రోల్ రైడాకు, కౌశల్‌కు హోస్ట్‌కు నాని గట్టిగా క్లాస్ పీకడం మరోసారి బిగ్‌బాస్ హౌస్ హీటెక్కనున్నట్టు స్పష్టంగా కనిపించింది. నాని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు ఎలా ఉందంటే..

రోల్ రైడాకు నాని క్లాస్

రోల్ రైడాకు నాని క్లాస్

రోల్ రైడా.. బిగ్‌బాస్ హౌస్‌లో మంచి అనిపించుకోవడమే కాదు. మంచి కోసం నిలబడటం కూడా చాలా ముఖ్యమైంది. మీకు ఓ తప్పనిపించవచ్చు. మరో కరెక్ట్ అనిపించవచ్చు. దానిని అక్కడికక్కడే అడిగే దమ్ము నీలో ఉందా లేదా అని నాని నిలిదీశాడు.

కౌశల్‌పై నాని సీరియస్

కౌశల్‌పై నాని సీరియస్

నాని అడిగిన ప్రశ్నలకు రోల్ రోడా సమాధానం ఇస్తూ.. మొదట కౌశల్ గారు.. అలా అన్నప్పుడు నేను స్పందించాను అని అన్నాడు. దాంతో ఏమన్నాడని నాని ప్రశ్నించగా.. రోల్ రైడా చెప్పిన సమాధానంతో నాని సీరియస్ అయ్యాడు.

కౌశల్‌కు షాకిచ్చిన నాని

కౌశల్‌కు షాకిచ్చిన నాని

రోల్ రైడాను అలా అన్నావా అని నాని ప్రశ్నించగా అవును అని కౌశల్ తలూపాడు. దాంతో అది తోటి ఇంటి సభ్యుడిపై చేసిన చాలా దారుణమైన స్టేట్‌మెంట్ అని నాని పేర్కొన్నాడు. దాంతో చిన్న పిల్లలు వచ్చిన ట్రాన్స్‌లో ఉన్నాను అని పేర్కొనగా.. నీవు అన్న తర్వాతే పిల్లలు ఇంట్లోకి వచ్చారు అని నాని ఝలక్ ఇచ్చారు.

ఎలిమినేషన్‌లో ఎవరంటే

ఎలిమినేషన్‌లో ఎవరంటే

ఇక బిగ్‌బాస్‌లో ఈ వారం గీత, రోల్ రైడా, దీప్తి, అమిత్‌తోపాటు కౌశల్ నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం అందరూ బలమైన అభ్యర్థులు కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. దీప్తి, లేదా అమిత్‌లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X