బిగ్‌బాస్2 కోసం నాని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? డేట్ కన్ఫర్మ్!
Recommended Video

దేశవ్యాప్తంగా టెలివిజన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. రెండో సీజన్‌కు కోసం ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహారించిన జూనియర్ ఎన్టీఆర్ తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నానికి అవకాశం దక్కింది.

బుల్లితెరపైకి నాని
తన యాక్టింగ్ ప్రతిభతో ఇప్పటి వరకు వెండితెర మీద దూసుకెళ్తున్న నాని బిగ్‌బాస్2 కోసం సిద్దమవుతున్నాడు. బుల్లితెర మీద ఎలా ఆకట్టుకొంటున్నాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
జూన్ 10న బిగ్‌బాస్2
బిగ్‌బాస్2 కార్యక్రమాన్ని తెలుగులో జూన్ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి షో ఫార్మాట్‌ను కూడా మార్చారు. సాధారణ ప్రేక్షకులను కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించడం గమనార్హం.

100 రోజులపాటు బిగ్‌బాస్2
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్1 కార్యక్రమం కేవలం 70 రోజులకే పరిమితమైంది. కానీ రెండో సీజన్ మాత్రం 100 రోజులు సాగనున్నది. దీంతో ఎన్టీఆర్, నాని మధ్య పోలికలు మొదలయ్యాయి.

నాని రెమ్యునరేషన్ ఇదే
బిగ్‌బాస్2 కార్యక్రమం కోసం నాని భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకొంటున్నట్టు సమాచారం. దాదాపు నానికి స్టార్ మా టీవీ రూ.4 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











