నేను 'గే' అయితే నా బాయ్ ఫ్రెండ్ అతడే.. బాంబు పేల్చిన నాని, మరోసారి హోస్ట్‌గా!

ఏడాదికి సైలెంట్ గా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ నాని వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 2కు హోస్ట్ గా మారి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీజన్ మొత్తం సరదాగా సాగిన నాని హోస్టింగ్ అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ ముగియడంతో మళ్ళీ సినిమాలతో నాని బిజీ అయపోయాడు. ఇటీవలే నాని నటించిన దేవదాసు చిత్రం విడుదలయింది. ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా నెం 1 యారీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు నాని గెస్ట్ గా హాజరయ్యాడు.

మళ్ళీ హోస్ట్‌గా మారి

మళ్ళీ హోస్ట్‌గా మారి

కేవలం నాని మాత్రమే కాదు.. నానితో పాటు క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ షోకు హాజరైంది. రానా లేని సమయంలో నాని హోస్ట్ గా మారి అలరించాడు. తన షోలో మరొక వ్యక్తి హోస్ట్ గా మారడంతో ఉలిక్కి పడుతూ రానా పరిగెత్తడం వినోదాత్మకంగా ఉంది. ఈ ముగ్గురు క్రేజీ సెలెబ్రిటీలు కలసి రచ్చ రచ్చ చేసినట్లు కనిపిస్తోంది.

'గే' పాత్రలో నటిస్తే

'గే' పాత్రలో నటిస్తే

ఈ షోలో రానా నానికి కొన్ని చిలిపి ప్రశ్నలు సంధించాడు. గే పాత్రలో నటించాలంటే ఎవరిని బాయ్ ఫ్రెండ్ గా ఎంచుకుంటావు అని అడగగా నిన్నే అంటూ నాని సమాధానం ఇవ్వడం నవ్వులు పూయిస్తోంది. నీ ఫస్ట్ క్రష్ కోసం నువ్వేం చేశావు అని రానా అడగగా.. బట్టలిప్పేసి ఆకుల కట్టుకున్న సందర్భాని నాని వివరించాడు. మధ్యలో రానా కల్పించుకుని.. ఇక ఆపరా బాబు కంగారుగా ఉంది అని అన్నాడు.

నేను లోకల్ డైలాగ్

నేను లోకల్ డైలాగ్

నాని, కీర్తి సురేష్ కలసి నటించిన నేను లోకల్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఎవర్రా పొట్టి అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ బాగా ఫేమస్. ఆ డైలాగ్ ని నెం 1 యారీలో కీర్తి సురేష్ సరదాగా చెప్పడం ఆకట్టుకుంటోంది. ఈ షో పూర్తి ఎపిసోడ్ ఆదివారం రోజు ప్రసారం కానుంది. రానా హోస్ట్ గా వ్యవహరిన్న ఈ షో ఆడియన్స్ ని అలరిస్తూ బాగా పాపులర్ అవుతోంది.

విభిన్నమైన పాత్రలు

కీర్తి సురేష్, రానా, నాని తిరుగులేని నటన ప్రతిభ ఉన్న వారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి చిత్రంతో కీర్తి సురేష్, బాహుబలితో రానా, వరుస విజయాలతో నాని ఇప్పటికే తామేంటో నిరూపించుకున్నారు. నాని ప్రస్తుతం క్రికెట్ ప్రధానాంశంగా సాగే జెర్సీ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. రానా నటిస్తున్న చిత్రాల్లో అన్ని భాషల్లో తెరక్కుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X