బిగ్ బాస్2: ఎగిరి వాటేసుకున్న కౌశల్.. మరో సర్‌ప్రైజ్.. అసలు బిగ్ బాస్ నేనే!
Recommended Video

బిగ్ బాస్ షోలో అసలు మజా ఆరంభమైంది. రోల్ రైడ ఆదివారం ఎలిమినేట్ కావడంతో సామ్రాట్, తనీష్, కౌశల్, గీత, దీప్తి ఫైనల్స్ కి చేరుకున్నారు. ఈ ఐదుగురిలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలనుంది. ముందుగా అనుకున్నట్లుగానే గీత, కౌశల్, తనీష్ మొదటి మూడు స్థానాల్లో ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇక కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉండడంతో వీలైనంత ఎక్కువ వినోదాన్ని అందించే టాస్క్ లు రాబోతున్నాయి. నేడు జరగబోయే ఎపిసోడ్ లో ఆడియన్స్ కు ఓ సర్‌ప్రైజ్ ఉండనుంది.
నాగార్జున సందడి
ఆదివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజిపై నానితో కలసి మెరిసాడు. నాగార్జున తో పాటు దేవదాస్ చిత్ర హీరోయిన్లు రష్మిక, ఆకాంక్ష సింగ్ కూడా స్టేజిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఆదివారం ఎపిసోడ్ మొత్తం బాగా సందడిగా మారింది.

నేడు కూడా అదే జోరు
నేడు కూడా బిగ్ బాస్ హౌస్ లో మరో హీరో సందడి చేయబోతున్నాడు. ఇటీవలే నన్ను దోచుకుందువటే చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన సుధీర్ బాబు బిగ్ బాస్ హౌస్ లో మెరవబోతున్నాడు. ఆ ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

ఎగిరి వాటేసుకున్న కౌశల్
సుధీర్ బాబు హౌస్‌లోకి రాగానే కౌశల్ అతడిని ఎగిరి వాటేసుకున్నాడు. ఇంటి సభ్యులంతా సుధీర్ బాబుని, హీరోయిన్ నభా నటేష్ ని చూసి షాక్ అయ్యారు. సుధీర్ బాబు చెప్పిన ముచ్చట్లకు ఇంటి సభ్యులు బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తున్నారు. మీకు ఇక్కడ బిగ్ బాస్ ఇలాగే నన్ను దోచుకుందువటే చిత్రంలో నేనే బిగ్ బాస్ అని సుధీర్ బాబు తెలిపాడు.
వారం రోజులు మాత్రమే
100 ఎపిసోడ్స్ కి పైగా అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ మరో వారం రోజుల్లో ముగియబోతోంది. కౌశల్, తనీష్, గీత మధ్య టైటిల్ కోసం ఎక్కువ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. కానీ ఈ వారంలో జరుగబోయే పరిణామాలని బట్టి కూడా విజేత ఎవరో డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











