ముద్దులతో రెచ్చిపోయిన నరేష్, పవిత్ర లోకేష్ .. టీవీ షోలో హద్దులు దాటి!
నరేష్, పవిత్ర లోకేష్‌ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల కాలంలో ఈ జంట సోషల్ మీడియాను తెగ ఊపేస్తున్నారు . లేటు వయస్సులో ఘాటు రొమాన్స్‌ను ప్రేక్షకులకు రుచి చూపిస్తున్నారు. వీరిద్దరు కలిసి నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. నరేష్ వివాహిక జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగానే 'మళ్లీ పెళ్లి' సినిమాను తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. ఓ షోకు వచ్చిన ఈ జంట ముద్దులతో రెచ్చిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
నరేష్‌కు నాలుగు: విజయనిర్మల కొడుకుగా నరేష్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నరేష్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రోఫిషనల్‌గా బాగానే ఉన్నప్పటికీ, వ్యక్తిగత విషయానికి వచ్చే సరికి నరేష్ వివాదాలతో సావాసం చేస్తున్నారు. ముఖ్యంగా తన వివాహిక జీవితంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఆయన మూడు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తరువాత రమ్య అనే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఓ సినిమా షూటింగ్ సమయంలో పవిత్ర లోకేష్ పరిచియం కావడంతో నరేష్ ఆమెకు దగ్గరైయ్యాడు. దీంతో తన భార్య రమ్యకు విడాకులు ఇవ్వడానికి సైతం నరేష్ సిద్దపడ్డాడు. నరేష్-పవిత్ర లోకేష్ అక్రమ సంబంధాన్ని భార్య రమ్య నేరుగానే బయటపెట్టింది . అప్పటి నుంచి పవిత్ర లోకేష్‌ను వెంటపెట్టుకుని నరేష్ బహిరంగంగానే తిరుగుతున్నాడు.

పవిత్ర లోకేష్‌కు మూడు: పవిత్ర లోకేష్ చాలా సినిమాల్లో అమ్మ పాత్రల్లో కనిపించి మెప్పించింది. సినిమాల్లో చాలా హోమ్లీగా కనిపించే పవిత్ర లోకేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. తొలుత సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకున్న పవిత్ర లోకేష్.. కొంతకాలానికే అతనికి విడాకులిచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్‌గా అవకాశాలు పెరుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్‌ను రెండో వివాహం చేసుకున్నారామె. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సుచేంద్ర ప్రసాద్‌కు 2018 నుంచి పవిత్ర లోకేష్ దూరంగా ఉంటుంది. రెండో భర్తకు విడాకులు విచ్చి పిల్లలతో బెంగుళూరులో నివాసం ఉంటుంది. ఈక్రమంలోనే నరేష్‌తో మూడో పెళ్లికి పవిత్ర లోకేష్ సిద్దం అవుతుంది.

షోలో ముద్దులతో రెచ్చిపోయిన జంట: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోకి వీరిద్దరు గెస్ట్‌లుగా రావడం జరిగింది. ఈ షోలో సినిమా విశేషాలతో పాటు, తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటని ఓంకార్ అడగ్గా...ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటామని నరేష్ సమాధానం ఇచ్చారు. పవిత్ర లోకేష్‌ను ముద్దుగా అమ్ములు అని పిలుస్తానని. ఇంకా ముద్దొస్తే అమ్ము అని అంటానని .. అంతకు మించి చెప్పకూడదు అన్నారు. ఇక షోలో పాటకు డ్యాన్స్ వేస్తూ ఈ జంట ముద్దులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తగ్గిపోయిన ఆఫర్లు: ఇక వీరి కెరీర్ విషయానికి వచ్చే సరికి.. గతంలో నరేష్, పవిత్ర లోకేష్‌లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మంచి డిమాండ్ ఉండేది. కాని వీరి మధ్య బంధం బయటపడినప్పటి నుంచి వీరిద్దరికి అవకాశాలు తగ్గినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవిత్ర లోకేష్‌కు తల్లి పాత్రలు పెద్దగా రావడం లేదు. ఆమె స్థానంలో మరో ఆర్టిస్ట్‌ను తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఇలా ఉంటే వీరిద్దరు కలిసి నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.తెలుగు, కన్నడలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











