Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు భార్య సపోర్ట్ లేకపోవడానికి కారణం అదేనట.. నిజం చెప్పేసిన సీరియల్ నటుడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్బుతంగా సాగుతోంది. అదిరిపోయే ట్విస్ట్ లతో పాటు అంతకు మించిన ఎమోషన్లు పండించడంలోనూ బిగ్ బాస్ నిర్వాహకులు సఫలం అవుతూనే ఉన్నారు. అయితే మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లో అడుగు పెట్టగా.. ఐదో వారంలో 2.0 పేరుతో మరో ఐదుగురు కంటెస్టెంట్లను ఇంట్లోకి పించారు. అలాగే అప్పటికే ఎలిమినేట్ అయిపోయి మరోసారి ఇంట్లో అడుగు పెట్టిన రతికా రోజ్ ను కూడి తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చారు. గేమ్ రసవత్తరంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆట తీరు అంతా ఉల్టాపుల్టాగా మారిపోయింది.

మొదటి వారంలోనే ఇంట్లోకి అడుగు పెట్టిన అమర్ దీపే విజేతగా నిలుస్తాడని అంతా అనుకోగా... రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కార్నర్ చేసి గేమ్ ఆడడంతో ఫుల్ నెగిటివిటీని సొంతం చేసుకున్నాడు. అసలు విన్ అవ్వడం కాదు.. కనీసం టాప్ 5కి కూడా రాడని అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి అమర్ దీప్ గేమ్ అంతా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ఆడుతుండడంతో.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతేనా గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అమర్ దీపే విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Naresh Lolla Reveled The Reason Of Teju Not Support to Amardeep in Bigg Boss Telugu 7

ఇదంతా ఇలా ఉండగా.. అమర్ దీప్ క్లోజ్ ఫ్రెండ్ నరేష్ లొల్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జానకి కలగనలేదు సీరియల్ లో అమర్ దీప్ తమ్ముడిగా విష్ణు పాత్రలో కనిపించింది నరేష్ యే. అయితే ఈయన అమర్ కు చాలా మంచి స్నేహితుడు. అసలు అమర్ దీప్ వ్యక్తిత్వ ఎలాంటిది, ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు. బిగ్ బాస్ షోకు వెళ్లేముందే అమర్ దీప్ పరిస్థితి అంత బాగా లేదని.. ఆరోగ్య సమస్యలతోనే అతడు ఇంట్లో అడుగు పెట్టాడని వివరించాడు. కానీ ఎక్కడ కూడా ఆ విషయం చెప్పకుండా, సింపతీ కోసం ట్రై చేయలేదని చెప్పాడు.

Naresh Lolla Reveled The Reason Of Teju Not Support to Amardeep in Bigg Boss Telugu 7

నిజంగానే అమర్ దీప్ కు ఫిట్స్ వస్తుందని.. ప్రస్తుతం మందులు కూడా వాడుతున్నాడని నరేష్ లొల్ల వివరించారు. అలాగే అమర్ కు ఆయన భార్య తేజూ సపోర్ట్ లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు చేస్తుంటేనే సపోర్ట్ చేసినట్లు కాదని.. అవసరం ఉన్నప్పుడు ఆమె కచ్చితంగా వస్తుందని వివరించాడు. అమర్ కోసం వీడియో చేస్తే బూతులు తిట్టి, చెత్త వీడియోలన్నీ పంపారని గుర్తు చేశాడు. అందుకే తేజూ వీడియో చేసేందుకు కూడా భయపడుతుందని అన్నాడు.

Naresh Lolla Reveled The Reason Of Teju Not Support to Amardeep in Bigg Boss Telugu 7
కానీ ప్రస్తుతం పరిస్థితి మొత్తం మారిపోయిందని నరేష్ తెలిపాడు. గతంలో ఫుల్ నెగిటివిటీ ఉండగా.. ఇప్పుడు చాలా మంచి రెప్సాన్స్ వస్తోందని.. అమర్ అసలు క్యారెక్టర్ కూడా ఇదేనని తెలిపాడు. ఎలాంటి మాస్కు లేకుండా గేమ్ ఆడుతున్నాడని, కానీ తన అనుకున్న వాళ్లే అతడిని మోసం చేస్తున్నారని స్పష్టం చేశాడు. ఏది ఏం జరిగినా అమర్ దీప్ గెలుస్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చాడు. చూడాలి మరి అమర్ దీప్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X