మాటలతో మళ్లీ రచ్చ చేసిన నటరాజ్ మాస్టర్.. బిగ్ బాస్‌కు మించి వాళ్లతో గొడవ
తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లు, బిగ్ బాస్ ప్రియులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ లో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
కొన్నిసార్లు ఆయన వాదనలో నిజమున్నా.. మరికొన్ని సార్లు మాత్రం ప్రేక్షకులకు విసుగు పుట్టించారు. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే తాజాగా నటరాజ్ మాస్టర్ మరోసారి తన మాటలతో రచ్చ చేశారు. అసలు ఏమైందనే విషయంలోకి వెళితే..
Photo Credits: Star Maa

8 జోడీలు: బుల్లితెరపై స్టార్ మా వేదికగా 'నీతోనే డ్యాన్స్' అనే కొత్త డ్యాన్స్ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ షోలో సీరియల్ నటీనటులు అమర్ దీప్-తేజస్విని, నిఖిల్-కావ్య శ్రీ, శివ కుమార్-ప్రియాంక జైన్, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీపా జగదీష్, పవన్-అంజలి 8 జోడీలు ఉన్నాయి.
ప్రాపర్టీ రౌండ్: తాజాగా నీతోనే డ్యాన్స్ షోలో ప్రాపర్టీ రౌండ్ జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. ప్రోమోలో సదా ఎక్స్ ప్రెషన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తుందో చెప్పి సెటైర్ వేశారు తరుణ్ మాస్టర్. తర్వాత ప్రాపర్టీ రౌండ్ లో భాగంగా సాగర్-దీప జోడి మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో సదా స్టేజీపైకి వచ్చిన వారిని హాగ్ చేసుకుంది.

సైకిల్ టైర్లతో: "నేను ఇప్పటివరకు పెళ్లికి, పెళ్లి చేసుకునేందుకు పర్ఫెక్ట్ పర్సన్ ను చూడలేదు. కానీ మీ ఇద్దరినీ, స్పెషల్ గా సాగర్ ను చూస్తుంటే నాకు ఇప్పుడే కావాలి అనిపిస్తుంది" అని సదా అంది. తర్వాత "నేను కూడా సదాలాగా సాగర్ ను లవ్ చేస్తున్నాను" అని అదోలా తరుణ్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ప్రియాంక జైన్-శివకుమార్ జంట కలిసి సైకిల్ టైర్లతో డ్యాన్స్ చేశారు.
ఇదివరకే చేశారు: ప్రియాంక జోడీ డ్యాన్సుకు జడ్జెస్ బాగానే మెచ్చుకున్నారు. తర్వాత ఆట ఫేమ్ సందీప్, అతని భార్య జ్యోతి జంట ఓబోపై డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మీ గ్రాఫ్ మరింత పెరిగిందని రాధ అంటే.. ఇది ఫైనల్ కి చేసే డ్యాన్స్ అని తరుణ్ మాస్టర్ మెచ్చుకున్నారు. మీరు ఇలాంటి డ్యాన్స్ ఇదివరకే చేశారు అని ప్రియాంక అంటే.. ఇలాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఎప్పుడూ చేయలేదని సందీప్ అన్నాడు.

వాళ్లది మిస్టేక్: అనంతరం నటరాజ్ మాస్టర్ జోడీ డ్యాన్స్ చేసింది. అది చూసి "ఇప్పటివరకు చూసిన ఈ మొత్తం సీజన్ లో నాకు ఇది పూరెస్ట్ (చెడ్డ) పర్ఫామెన్స్ లా అనిపించింది" అని సదా అంది. "సారీ, టోటల్ బ్యాడ్" అని రాధ అంది. దీనికి "నేను తప్పు చేస్తే హండ్రెడ్ పర్సంట్ తల వంచి సారీ అని చెప్పేస్తాను. నాది ఇక్కడ మిస్టేక్ కాదు. వాళ్లది మిస్టేక్. ఇక్కడ ఏదో చేసేయాలి. నా పైత్యం అంతా ఇక్కడ రుద్దేయాలి అని రాలేదు. ఓన్లీ ఎంటర్టైన్ మెంట్" అని నటరాజ్ మాటలతో రెచ్చిపోయాడు.

ఇక్కడ ఉంటారా?: నటరాజ్ మాస్టర్ మాటలకు "మీకోక విషయం తెలుసా. మీ అందరికంటే, మా ముగ్గురి కంటే చాలా మంచి డ్యాన్సర్స్ ఈ ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్లకు లేని ఒక ఎంటర్టైన్ మెంట్ ను ఇచ్చేందుకు మనం వచ్చామా. బట్ మిమ్మల్ని సెలెక్ట్ చేశాం. మీరు లక్కీ, మేము లక్కీ" అని రాధ అంది. "నా తప్పు కాదు మేడమ్. నేను పడను" అని నటరాజ్ మాస్టర్ ఎక్కడా తగ్గలేదు. "ఓకే మీరు ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వచ్చారా. మీరు ఇక్కడ ఉంటారా లేదా అది" అని రాధ వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











