అమ్మాయిగా మారిన నటరాజ్ మాస్టర్.. స్టేజీపైనే అతనితో టైట్ హగ్గులు, ఘాటు రొమాన్స్
నటరాజ్ మాస్టర్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షోను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి నటరాజ్ మాస్టర్ కచ్చితంగా గుర్తుండిపోతారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరోయిన్ బిందు మాధవితో నటరాజ్ మాస్టర్ వాగ్వాదం, గొడవలు మంచి టీఆర్పీ పెంచాయి. అయితే తాజాగా నటరాజ్ మాస్టర్ అమ్మాయిగా మారిపోయారు. అలా మారడమే కాకుండా స్టేజీపైనే ఘాటు రొమాన్స్, హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో షాక్ ఇచ్చారు.
8 జోడీలు:బుల్లితెరపై స్టార్ మా వేదికగా 'నీతోనే డ్యాన్స్' అనే కొత్త డ్యాన్స్ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ షోలో సీరియల్ నటీనటులు జంటలుగా స్టెప్పులేస్తున్నారు. కొందరు రియల్ లైఫ్ కపుల్స్ ఉంటే మరికొందరు రీల్ పెయిర్స్ ఉన్నారు. ఈ షోలో అమర్ దీప్-తేజస్విని, నిఖిల్-కావ్య శ్రీ, శివ కుమార్-ప్రియాంక జైన్, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీపా జగదీష్, పవన్-అంజలి 8 జోడీలు ఉన్నాయి.
డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా:ఇక సరికొత్త థీమ్ తో ఇది కదా మాకు కావాల్సింది అనేంతలా ఉంది నీతోనే డ్యాన్స్ షో. ఇప్పటివరకు డ్యాన్స్ షోలో హాట్ పర్ఫామెన్స్, ఘాటు రొమాన్స్ లో మునిగిపోయిన కంటెస్టెంట్స్ మరోసారి అద్భుతంగా ప్రదర్శించారు. తాజాగా ఈ షో ప్రోమోను విడుదల చేశారు. ఈసారి డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనే థీమ్ తో కంటెస్టెంట్లు పర్ఫామ్ చేయనున్నట్లు శ్రీముఖి తెలిపింది.

క్లాసిక్ టచ్:డ్యాన్సెస్ ఆఫ్ థీమ్ జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక జైన్ తన పార్టనర్ శివ కుమార్ తో కలిసి పంజాబీ భాంగ్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. వీళ్ల పర్ఫామెన్స్ కు జడ్జస్ అయిన రాధ, సదా, తరుణ్ మాస్టర్ ఫిదా అయిపోయారు. ఇక తనకు పంజాబీ మెన్ అంటే చాలా ఇష్టం అంటూ రాధ సిగ్గుపడుతూ చెప్పారు. అనంతరం అమర్ దీప్-తేజస్విని నాటు నాటు పాటకు క్లాసిక్ టచ్ ఇచ్చారు. కానీ సింక్ మిస్ అయిందని సదా అనడంతో తేజు ఎమోషనల్ అయింది.

మాటలతో హీట్:నిఖిల్-కావ్య శ్రీ జంట కూడా అదరగొట్టింది. యాదమ్మ రాజు-స్టెల్లా జోడీ అద్భుతంగా చేశారు. ప్రాపర్టీస్ బాగా ఉపయోగించడంతో న్యాయ నిర్ణేతలు మెచ్చుకున్నారు. కానీ దీనికి, మ్యాజిక్ ఉంది. డ్యాన్స్ ఉంటే బాగుండేది అని అంజలి చేసిన కామెంట్స్ తో కాస్తా హీట్ పెరిగింది. తర్వాత ఆట సందీప్-జ్యోతి పర్ఫామెన్స్ ఇచ్చారు. వీళ్ల డ్యాన్సుకు తరుణ్ మాస్టర్ తెగ ఇంప్రెస్ అయ్యారు.

భర్త ముందు చేయాలి:ఇక చివర్లో నటరాజ్ మాస్టర్-నీతూ తమ డ్యాన్సుతో ఫిదా చేసేశారు. లేడీ గెటప్పులో నటరాజ్ మాస్టర్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ ఉర్రూతలూగించాయి. సూపర్ మచ్చి, నా తప్పు ఏమున్నదబ్బా పాటలకు నటరాజ్ మాస్టర్ చేస్తుంటే తరుణ్ మాస్టర్ ఊగిపోయారు. ఇక నటరాజ్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నేర్చుకోని భర్త ముందు ప్రజంట్ చేయాలని రాధ అన్నారు. సదా కూడా చాలా పొగిడారు.

ఘోరం చూడలేక:తరుణ్ మాస్టర్ అయితే ఏకంగా స్టేజీపైకి వచ్చి నటరాజ్ మాస్టర్ ను గట్టిగా హగ్ పట్టేసుకుని హగ్గుల మీద హగ్గులు ఇచ్చారు. తొడకొట్టి మరి నటరాజ్ మాస్టర్ చీర కొంగు లాగి నానా రచ్చ చేశారు. తరుణ్ మాస్టర్ చేష్టలకు నటరాజ్ మాస్టర్ కోపరేట్ చేస్తూ ఘాటుగా రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. వీళ్ల ఘోరం చూడలేక రాధ, సదా కళ్లు మూసుకుని నవ్వేశారు. "నేను యోగిలా ఉన్నాను. ఇప్పుడు భోగి అయిపోయాను" అని తరుణ్ మాస్టర్ అన్నారు.


Click it and Unblock the Notifications











