నానిని హగ్స్‌తో చంపేస్తున్నారా... చీఫ్ గెస్ట్‌గా పిలిచి ఏంట్రా ఇది, రెండు ఛానెల్స్‌లోనూ సేమ్ సీన్..

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హేమా హేమీలున్న తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకుని నేచురల్ స్టార్‌గా అభిమానులతో పిలిపించుకుంటున్నారు నాని. కష్టపడితే ఎంతటి సామాన్యుడైన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నాని నిరూపించారు. ఓ వైపు హీరోగా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూనే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మాతగానూ మారారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నాని పలు సందర్భాల్లో చెప్పారు. కంటెంట్‌లో కొత్తదనం ఉంటే చాలు తన బడ్జెట్ పరిధిలో సినిమాలకు ఓకే చెబుతున్నారు నేచురల్ స్టార్.

ప్రస్తుతం నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సరిపోదా శనివారం మూవీతో మళ్లీ థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.

natural star nani attend as a chief guest simultaneously in Kiraack Boys Khiladi Girls and ETV 30 Years Celebrations

ఇదిలాఉండగా.. నాని అప్పుడప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంటారు. టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే రియాలిటీ షోలకు , స్పెషల్ ఈవెంట్స్‌కు గెస్ట్‌గా వెళ్తుంటారు. ఈసారి మాత్రం ఆయన ఒకే వారంలో రెండు ఛానెల్స్‌లో జరిగిన రెండు ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా హాజరై షాకిచ్చారు. మా టీవీలో ప్రసారమవుతున్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకు ఈ వారంతో ఎండ్ కార్డ్ పడనుంది. స్టార్ యాంకర్ అనసూయ ఖిలాడీ బ్యూటిస్‌కి , కిర్రాక్ బాయ్స్‌కి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ లీడర్స్‌గా ఉంటే.. మన రాములమ్మ శ్రీముఖీ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నానీ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. స్టేజ్‌పై ఆయన ఎంట్రీ ఇవ్వగానే ఓ బుల్లితెర నటి పరిగెత్తుకుంటూ వచ్చి నానిని హగ్ చేసుకోవడంతో అంతా షాక్ అవుతారు. హోస్ట్ శ్రీముఖి .. ఆయనకు పెళ్లయ్యిందని , వదిలిపెట్టాలని హెచ్చరిస్తుంది. ఆ అమ్మాయి మాత్రం ఇట్స్ ఓకే పర్లేదండి అని చెబుతుంది. దానికి నాని కూడా ఇట్స్ ఓకే నాక్కూడా పర్లేదంటూ నవ్వుతూ చెబుతున్నారు. అనంతరం జడ్జి సీట్‌లో కూర్చొని ఈరోజు గ్రాండ్ ఫినాలేలా లేదని.. నాలుగేళ్ల కాలేజీ లైఫ్‌కి ఈరోజు ఫేర్‌వెల్‌లా ఉందని చెప్పారు.

ఇక ఈటీవీ ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది యాజమాన్యం. దీనిలో భాగంగా సుధీర్ - సోనియా హోస్ట్‌ చేసిన ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రసారం కానుంది. ఈ స్పెషల్ ఈవెంట్‌కు కూడా నాని చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అయితే సేమ్ టూ సేమ్ మాటీవీలో మాదిరిగానే ఓ అమ్మాయి నాని హగ్ చేసుకుంది. కానీ అక్కడిలా కాకుండా ఆయన పర్మిషన్ తీసుకుని హగ్ చేసుకుంది. దానికి మన హైపర్ ఆది వెంటనే .. మిమ్మల్ని హగ్ చేసుకున్న అమ్మాయిని నేనొక సారి హగ్ చేసుకోవచ్చా అని అడిగి నవ్వులు పూయిస్తాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాని రెండు టాప్ తెలుగు ఛానెల్స్‌ని కవర్ చేసేశాడుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X