మీరు మనుషులేనా? ఇంత విషమా? సిగ్గుపడాలి.. నాని ఫైర్! తేజస్విపై అసభ్యంగా..!
Recommended Video

నేచురల్ స్టార్ నాని చాలా కూల్‌గా నవ్వుతూ కనిపిస్తారు. ఆయనకు నిజంగా కోపం వస్తుందా అనే అనుమానం కలుగకమానదు. అలాంటిది ఆదివారం ప్రసారమైన బిగ్‌బాస్ షోలో నెటిజన్లపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వారు మాట్లాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై నాని సీరియస్ అయ్యారు. నాని ఆగ్రహం ఆయన మాటల్లోనే..

మనిషిగా ఓ మాట చెప్పాలని
బిగ్‌బాస్ హోస్ట్‌గా నా బాధ్యతను బాగానే నిర్వర్తిస్తున్నాను. ఓ మనిషిగా ఒక విషయం చెప్పాలనుకొంటున్నాను. రీసెంట్‌గా బిగ్‌బాస్ టీమ్ నాకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ వీక్ నుంచి సోషల్ మీడియాలో షోపై, ఇంటి సభ్యులపై వస్తున్న రియాక్షన్ ఎలా ఉందనే విషయాన్ని వారు నాకు చూపించారు.

ఆ మాటలతో ఒళ్లు మండిపోతున్నది
సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్ చూసి ఒళ్లు మండిపోతున్నది. కోపం వస్తున్నది. మనకు ఓ ఇంటి సభ్యుడు నచ్చవచ్చు.. నచ్చకపోవడం కామన్. ఓ హౌస్‌మేట్ ఇంటి నుంచి బయటకు పోవాలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇంట్లో వ్యక్తి నాకు నచ్చడం లేదని చెప్పడం కామన్. వాడిని బయటకు పంపండి అనే భావ ప్రకటిత స్వేచ్ఛ మనకు ఉంది.

ఉపయోగించే భాష చాలా నీచంగా
ఇంటి సభ్యుల గురించి ముఖ్యంగా తేజస్వి గురించి సోషల్ మీడియాలో ప్రధానంగా ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ఉపయోగించిన భాష చాలా నీచంగా ఉంది. అలాంటి మాటలు చెప్పడానికే కోపంగా ఉంది. ఇలాంటి భాషను ఉపయోగించే వాళ్లు బయట తిరుగుతున్నారా? ఇంత విషం నింపుకొని సొసైటీలో జీవిస్తున్నారా? ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటే కడుపు తరుక్కుపోతున్నది.

చెత్త మాట్లాడితే హీరోయిజమా?
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఉపయోగించిన మాటలు అత్యంత అశ్లీలంగా, అసభ్యకరంగా, జుగప్సకరంగాగా, మాటల్లో చెప్పడానికి కూడా వీలులేవు. చెత్తంతా మాట్లాడుతుంటే హీరోయిజం అనుకొంటున్నారా? మనమంతా మనుషులమని గుర్తించాలి.

సిగ్గుపడే రోజు వస్తుంది
లైఫ్ ఎప్పుడో ఏదో ఒకరోజు మన తప్పులన్నీ భూతద్దంలో చూపిస్తుంది. అది చూసి సిగ్గుపడాల్సిన రోజు మనకు రావొద్దు. మనసులో ఇంత ద్వేషం, విషం నింపుకొంటే.. అదే ఏదో రోజు మనల్ని ఫినిష్ చేస్తుంది. ఇది ఓ గేమ్ షో అని గుర్తించాలి.

అన్నగా మాట చెప్పాను..
ఓ అన్నగా మీకు ఓ మంచి మాట చెప్పానని అనుకొంటే అందుకు థ్యాంక్స్. ఏంది వీడు, ఇలా మాట్లాడారని అనుకొంటే ఖర్మ అని నాని ఆవేశంగా మాట్లాడారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే నాని నెటిజన్లు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











