సన్నీలియోన్‌తో నవదీప్.. పద్దతైన, పవిత్రమైన వెబ్ సిరీస్ అట.. షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్‌కు పోటీగా దింపిన అదిరింది అనే షో.. మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. మొదటి ఎపిసోడ్‌కు నిహారిక ముఖ్య అతిథిగా వచ్చి జడ్జ్ స్థానంలో నాగబాబు పక్కన కూర్చుంది. గత ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ షోలో వేణు వండర్స్, ధన్ రాజ్, కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్రలాంటి వారు వేసిన స్కిట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే మొదటి ఎపిసోడ్ కావడం, అందరూ మెప్పించడంతో అన్ని టీమ్‌లను విజేతలుగా ప్రకటించామని నాగ బాబు యూట్యూబ్ చానెల్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్‌కు పోటీగా..
జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన డైరెక్టర్లు నితిన్-భరత్.. జీ చానెల్‌లో కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. లోకల్ గ్యాంగ్స్ అనే కొత్త షోను ప్రారంభించగా.. తాజాగా అదిరింది అనే మరో కామెడీ షోను ప్రారంభించారు. అయితే ఇది జబర్దస్త్‌కు కాపీ అంటూ విమర్శలు వినిపించాయి. జబర్దస్త్‌లోని స్కిట్ల మాదిరిగానే ఉన్నాయంటూ వీక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

ఆ ఆలోచన వారి వల్లే..
గత ఆదివారం రాత్రి అదిరింది షో ప్రారంభం కాగా.. అదే సమయంలో జబర్దస్త్ పాత స్కిట్లను ప్రసారం చేశారని యాజమాన్యంపై నాగ బాబు సెటైర్ వేశాడు. ‘కార్పోరేట్ సిస్టమ్ అంటే అలానే ఉండాలి.. స్పోర్టివ్‌నెస్ ఉండాలి.. పోటీ ఉండాలి.. అప్పుడే మాక్కూడా కొత్తగా చేయాలనిపిస్తుంది.. మాకు జబర్దస్త్‌కు పోటీగా షోను నడపాలనే ఆలోచన లేదు.. వారే మాకు అలాంటి ఆలోచనలను కల్పించార'ని అన్నాడు.

రెండో ఎపిసోడ్ గురించి..
మొదటి, రెండు ఎపిసోడ్‌లకు సంబంధించిన షూటింగ్ జరిగిందని, ఫస్ట్ ఎపిసోడ్‌లో నిహారిక, రెండో ఎపిసోడ్‌లో నవదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఎపిసోడ్‌లు చాలా బాగా వచ్చాయని, తాను చాలా ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు. తాజాగా ఆ రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

నవదీప్ పంచులు..
వచ్చీ రాగానే యాంకర్ సమీరకు బిస్కెట్ వేస్తూ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సన్నీ, బన్నీలతో సినిమాలను చేస్తున్నానని, పద్దతైన, పవిత్రమైన రాగిణి ఎమ్ఎమ్ఎస్ అనే వెబ్ సిరీస్‌లో నటించినట్టు తెలిపాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో నవదీప్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











