twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవదీప్-నాగబాబు మధ్య విబేధాలు.. అందుకే ‘అదిరింది’ నుంచి అక్కడికి జంప్!!

    |

    అదిరింది షో తన స్వరూపాన్ని మార్చుకుని బొమ్మ అదిరిందిగా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి ఎపిసోడ్‌తోనే బొమ్మ అదిరింది బ్లాక్ బస్టర్ అయింది. వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్‌తో వివాదం తారాస్థాయికి చేరింది. ఆ విషయాలు కాసేపు పక్కనబెడితే.. అదిరింది, బొమ్మ అదిరిందిలో వచ్చిన మార్పులు ఓ సారి గమనిద్దాం. అదిరింది 25 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఆ తరువాత బొమ్మ అదిరిందిగా మారింది.

    తీసేశారు.. తీసుకొచ్చారు..

    తీసేశారు.. తీసుకొచ్చారు..

    అదిరింది షోలో యాంకర్లుగా ఉన్న రవి, భాను శ్రీలను తీసేశారు. శ్రీముఖిని పట్టుకొచ్చి కూర్చొబెట్టారు. ఇక జడ్జ్ స్థానంలో ఉన్న నవదీప్‌ను తీసేశారు. జానీ మాస్టర్‌ను పట్టుకొచ్చారు. ఇలా ఓ రేంజ్ం‌లో మార్పులు చేర్పులు చేశారు. నవదీప్‌ను తొలగించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

    అత్యంత సన్నిహితుడు..

    అత్యంత సన్నిహితుడు..

    నవదీప్ అనేవాడు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. మెగా బ్రదర్ నాగబాబు అందుకే ఏరికోరి మరీ నవదీప్‌ను అదిరిందిలోకి తీసుకున్నాడు. నాగబాబు అదిరింది షోలో కనిపించని హెడ్. నాగబాబుకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోలేరు. అయితే నవదీప్ తొలగింపు విషయంలోనూ నాగబాబు ఓకే చెప్పకపోతే అది జరిగే వీలుండదు. అయితే నవదీప్ అదిరింది నుంచి బయటకు రావడంతో ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి ఉంటాయని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

    ఆ స్పెషల్ ఈవెంట్‌లో..

    ఆ స్పెషల్ ఈవెంట్‌లో..

    అదిరింది నుంచి బయటకు వచ్చిన యాంకర్ రవి.. జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చేశాడు. స్కిట్స్‌లో స్పెషల్ రోల్ వేస్తూ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలో దసరా స్పెషల్ ఈవెంట్‌లోనూ యాంకర్ రవి రచ్చ చేశాడు. ఈ సారి దసరాకు అక్కా ఎవరే అతగాడు అంటూ దుమ్ముదులిపే ప్రోగ్రాంను సెట్ చేయగా నవదీప్ అందులో తనశైలిలో పంచ్‌లు వేశాడు.

    Recommended Video

    Navdeep About Allu Arjun In Ala Vaikunthapurramuloo Success Meet
    నవదీప్ సెటైర్లు..

    నవదీప్ సెటైర్లు..

    అక్కా ఎవరో అతగాడు ప్రోగ్రాంలో నవదీప్ రచ్చ రచ్చ చేశాడు. యాంకర్ రవి, నవదీప్ పోటాపోటీగా దుమ్ములేపారు. సోదాపు దమ్ముంటే నన్నాపు అంటూ యాంకర్ రవికి అదిరిపోయే సెటైర్ వేశాడు నవదీప్. అయితే కేవలం ఇలా స్పెషల్ ఈవెంట్లతోనూ సరిపెడతాడో మరి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లోనూ కనిపిస్తాడేమో చూడాలి.

    English summary
    Navdeep Entry In ETV dasara Event Akka Evare Athagadu, Navdeep And Anchor Ravi Fun In Akka Evare Athagadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X