నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

హీరోకి తగ్గ హైట్, అందం, పర్సనాలిటీతో పాటు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవదీప్. కానీ అదృష్టం కలిసిరాకపోవడంతో ఆయన సెకండ్ హీరోగా మిగిలిపోవాల్సి వచ్చింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న నవదీప్... 40కి చేరువ అవుతున్నా ఇప్పటికీ పెళ్లి మాటెత్తడం లేదు. టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఆయన కూడా ఒకరు. తాజాగా ఓ షోలో నవదీప్ నా భర్త, నా బిడ్డకు తండ్రి అంటూ ఓ నటి చేసిన రచ్చ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’

జై సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నవదీప్. ఆ తర్వాత మొదటి సినిమా, గౌతమ్ ఎస్ఎస్‌సీ, సీతాకోకచిలుక, చందమామ, ఆర్య 2 వంటి వరుస హిట్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ సక్సెస్‌ను కంటిన్యూ చేయడంలో విఫలమైన నవదీప్.. సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. అయినప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ, బుల్లితెర, ఓటీటీలు, బిజినెస్‌లతో బిజీ అయ్యారు నవదీప్. బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు నవదీప్.

Navdeep Shocked as Actress Claims He Is Her Husband and Father of Her Child on Mass Jathara Show

ప్రస్తుతం జెమిని టీవీలో ప్రసారమవుతున్న మాస్ జాతర షోకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటి బిందు మాధవీలతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు నవదీప్. బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. జబర్దస్త్ మాదిరిగా కామెడీ చుట్టూ తిరగే షో ఈ మాస్ జాతర. ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమం జనాల్లోకి వెళ్తోంది. తాజాగా విడుదల చేసిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended For You
'ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’
'ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’

ప్రోమో స్టార్టింగ్‌లో యాదమ్మరాజు తన ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతుండగా తన భార్య ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. నేను బయట ఉన్నాను కదా ఎందుకు ఊరికే దమ్ దమ్ చేస్తున్నావంటూ మండిపడతాడు. అయితే వీడియో కాల్ చేయమని భార్య అడగటంతో వాయిస్ వినిపించడం లేదంటూ రాజు డ్రామా ఆడతాడు. నా మాట నీకు వినిపిస్తుందని నాకు తెలుసు.. ఎక్స్‌ట్రాలు చేయొద్దని రాజుపై మండిపడుతుంది భార్య, దాంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు రాజు. అయితే ఫ్రెండ్స్‌ రాజు భార్యకి ఫోన్ చేసి ఇస్తారు. కానీ ముఖం చూపించకుండా ఫోన్‌పై పడుకుంటాడు.

You May Also Like
ఆ ప్రేమ చచ్చిపోయింది.. ప్రాణంగా ప్రేమిస్తే అలాంటి గతి... బిగ్‌బాస్ స్టార్ ఎమోషనల్
ఆ ప్రేమ చచ్చిపోయింది.. ప్రాణంగా ప్రేమిస్తే అలాంటి గతి... బిగ్‌బాస్ స్టార్ ఎమోషనల్

ఇంతలో కంటెస్టెంట్స్ అంతా వారి వారి భార్యలను పరిచయం చేస్తారు. ఇంతలో ఓకామె చంకలో పిల్లాడిని తీసుకొచ్చి.. ఏయ్ నవదీప్ ఇంట్లో పిల్లాడికి డైపర్స్ మార్చాలి, ఇంట్లో వంట చేయాలి. అవన్నీ మానుకుని నువ్వేం చేస్తున్నావు ఇక్కడ.. ఇంటికి రా అంటూ మండిపడుతుంది. ఆ మాటలు వినగానే జడ్జిలు బిందుమాధవి, జానీ మాస్టర్‌లు షాక్ అవుతారు. ఈ షాక్ నుంచి తేరుకున్న నవదీప్.. నువ్వు ఎవరమ్మా? అని అడుగుతాడు. పెళ్లాన్నే మరిచిపోతావా అని అమ్మాయి ప్రశ్నిస్తుంది. ఎవరి పెళ్లాం అమ్మా అని నవదీప్ అడగ్గా.. నీకే అంటుంది. ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నావు.. ఈ పిల్లాడిని చూడు, అచ్చం నాన్న పోలికలే అంటుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. యాదమ్మ రాజు మందు కొడుతున్నాడా? లేదా? నవదీప్ ఈ పంచాయతీని ఎలా తప్పించుకున్నాడు? తెలియాలంటే మాస్ జాతర లేటెస్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Read more about: navdeep Mass Jathara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X