Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటా, కానీ అక్కడికి రావు: అనసూయపై నవదీప్ షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియా వచ్చిన తరువాత ఆడియెన్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా చాలా క్లోజ్ అయ్యారనే చెప్పాలి. ఇక నెటిజన్లను ఎట్రాక్ట్ చేయడానికి వారు పోస్ట్ చేసే ఫొటోలు వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక అప్పుడప్పుడు లైవ్ చాటింగ్స్ తో అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా లైవ్ సెషన్స్ లో పాల్గొని చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇటీవల నవదీప్, యాంకర్ అనసూయ మాట్లాడుకున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవదీప్ స్పెషల్ ట్రిప్స్..
నవదీప్ బ్యాచిలర్ లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి స్పెషల్ ట్రిప్స్ కూడా వేస్తుంటాడు. ముఖ్యంగా హిమాలయాలు వంటి ప్రదేశాలకు వెళుతూ రిఫ్రెష్ అవుతుంటాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అనసూయకు తెలిపారు.
నాకు కూడా వెళ్లాలని ఉంది
హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఆ తరువాత శ్రీ నగర్ అలాగే హిమాలయాలకు స్నేహితులతో కలిసి బైక్ ల పైన వెళ్లినట్లు చెప్పిన నవదీప్ 5రోజుల పాటు ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. అయితే మధ్య మధ్యలో అనసూయ మాటలకు నవదీప్ కొన్ని పంచ్ లు కూడా చేశారు. నాకు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉందని చెప్పగానే నవదీప్ నవ్వుతూ ఒక మాట అనేశాడు.
మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటాను
నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటాను. కానీ మీరు అక్కడికి రారు అంటూ అని నవ్వేసరికి, వెళదాం.. వెళదాం.. అంటూ అనసూయ కూడా నవ్వేసింది. ఆ తరువాత ఇది లైవ్ కదా అంటూ మాట్లాడిన అనసూయా మీరు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారా అంటూ మరో మ్యాటర్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం వీరి సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఎవరు ఆపినా మీరు ఆపరు
ఇక మొత్తం 14 మంది కలిసి బైక్ లపైన వెళ్ళమని చెప్పిన నవదీప్ చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. ఇక లాక్ డౌన్ లో ఎవరు పనులు ఆపినా మీరు మాత్రమే ఆపేలా లేరని ప్రస్తుతం ఎలాంటి షూటింగ్స్ చేస్తున్నారని నవదీప్ అడుగగా.. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు సమాధానం ఇచ్చింది.
గర్ల్ ఫ్రెండ్, వైఫ్ లేకపోతే..
ఇక త్వరలోనే ఒక స్పెషక్ల్ హాంపర్ ని ఇంటికి పంపబోతున్నట్లు చెప్పగా అనసూయ హ్యాపీగా ఫీల్ అయ్యింది. నిజంగా నవదీప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావ్. అలా ఎలా..? అని ప్రశ్నించగా గర్ల్ ఫ్రెండ్, వైఫ్ లేకపోతే ఎవడైనా ఇలానే తిరగవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. మా ఆయన కూడా అలానే అన్నాడు అంటూ సరదాగా మరో సమాధానం ఇచ్చింది అనసూయ.