షో నుంచి బయటకు రావడంపై... సిద్ధు వైఫ్ హ్యాపీ!

By Bojja Kumar

Navjot Singh Sidhu
ముంబై: ఇండియాలో రియాలిటీ షోలలో ఎక్కువ ప్రజాదరణ పోందిన కార్యక్రమాలలో బిగ్ బాస్ ఒకటి. ఇందులో పలువురు సెలబ్రిటీలతో పాటు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొంటున్నందుకు గాను నవజ్యోత్ సింగ్ సిద్దుకి దాదాపు రూ 5కోట్ల వరకు ముట్టచెపుతున్నట్ల వినికిడి. నవజ్యోత్ సింగ్ సిద్దుకి బిగ్ బాస్ ఆఫర్ రావడానికి కారణం సిద్దు క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత పలు రియాలిటీ షోలలో పాల్గోనడమే కాకుండా క్రికెట్ వాఖ్యాతగా మంచి పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తి.

కొన్ని వారాలుగా బిగ్ బాస్ 6లో పాల్గొంటున్న నవజ్యోత్ సింగ్ సిద్ధు తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. తన భర్త బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంపై సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధు ఆనందం వ్యక్తం చేసారు. తన భర్తను కలిసి చాలా కాలమైందని, చాలా వారాల తర్వాత ఆయన్ను కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ బిజేపీ పార్టీ ఎంపిగా కొనసాగుతున్న సిద్ధూ రాజకీయ కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారా? లేక ముందగా నిర్ణయించిన ప్రకారం ఆయన బయటకు వస్తున్నారా? అనే విషయమై ఆయన భార్యను ప్రశ్నించగా రాజకీయ కారణాలతోనే ఆయన బయటకు వస్తున్నారని, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తప్పకుండా బయటకు రావాల్సి వస్తోందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X