For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవికృష్ణతో లవ్ ట్రాకుపై నోరు విప్పిన నవ్య స్వామి: ఎత్తుకుని తిప్పుతూ.. అందరి ముందే ఊహించని విధంగా!

  |

  సినీ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు బుల్లితెరపై కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో లవ్ ట్రాకులు హాట్ టాపిక్ అవుతున్నాయి. అందులోనూ సీరియల్ హీరో, హీరోయిన్ల మధ్యలో ప్రేమాయణాలు సాగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇలా ప్రేమ కహానీలతో ఫేమస్ అయిన వారిలో నవ్య స్వామి, రవికృష్ణ జంట ఒకటి. ఆ మధ్య ఓ సీరియల్‌లో కలిసి నటించిన వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ కలిసే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రవికృష్ణతో లవ్ ట్రాకుపై నవ్య స్వామీ నోరు విప్పింది. వివరాల్లోకి వెళ్తే...

  సీరత్ కపూర్ క్లీవేజ్ షో.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌గా

  అలా పాపులర్ అయిన నవ్య స్వామి

  అలా పాపులర్ అయిన నవ్య స్వామి

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు ప్రవేశించింది నవ్య స్వామి. ఈ క్రమంలోనే కన్నడంలో పలు సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపును అందుకుంది. అక్కడ ఎన్నో ధారావాహికల్లో నటించిన ఆమె.. ‘తన్‌గాలి'తో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో పాటు సత్తా చాటుతోంది.

  Intinti Gruhalakshmi July 28th Episode: నిజం చెప్పిన తులసి.. తప్పు చేశానని కాళ్లు పట్టుకున్న నందూ

  రవికృష్ణకు గుర్తింపు వచ్చింది ఇలానే

  రవికృష్ణకు గుర్తింపు వచ్చింది ఇలానే

  చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ఆరంభించాడు రవికృష్ణ. ఈ క్రమంలోనే ‘మొగలిరేకులు' అనే సీరియల్‌లో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. వరుసగా సూపర్ హిట్ సీరియల్స్‌లో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ‘వరూధినీ పరిణయం'తో హీరోగా మారడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా ఎన్నో సీరియళ్లలో నటించి బుల్లితెర స్టార్‌గా ఎదిగిపోయాడు.

  ఇద్దరూ కలిసి ఆ సీరియల్‌లో చేశారు

  ఇద్దరూ కలిసి ఆ సీరియల్‌లో చేశారు

  నవ్య స్వామీ.. రవికృష్ణ కలిసి ‘ఆమె కథ' అనే సీరియల్ చేశారు. ఇందులో కలిసి నటించడం వల్లో.. మరో కారణమో తెలియదు కానీ.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజులు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో రవికృష్ణ - నవ్య స్వామి తరచూ జంటగా హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

  ముద్దులు.. హగ్గులతో అనుమానాలు

  ముద్దులు.. హగ్గులతో అనుమానాలు

  కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాష్ షోలో బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయిన శివజ్యోతి, తన సీరియల్ పార్ట్‌నర్ నవ్యసామితో కలిసి రవికృష్ణ పాల్గొన్నాడు. ఇందులో సుమ ఇచ్చిన టాస్కులో భాగంగా హీరోయిన్‌‌కు ప్రియుడిలా నటించాడు. ఆ టాస్క్ కోసం నవ్యసామి... రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. అప్పుడామెను హగ్ చేసుకున్న అతడు.. నుదుటిపై ముద్దు పెట్టి హాట్ టాపిక్ అయ్యాడు.

  ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నేహా ఉల్లాల్: ఓ రేంజ్‌లో రచ్చ చేసిన జూనియర్ ఐశ్వర్యరాయ్

  సూటిగా ప్రశ్నించిన సుడిగాలి సుధీర్

  సూటిగా ప్రశ్నించిన సుడిగాలి సుధీర్

  స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఆదివారం ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' ఎంతో స్పెషల్‌గా జరగబోతుంది. దీనికి ఎంతో మంది సెలెబ్రిటీల ఫ్రెండ్ హాజరయ్యారు. ఇక, ఈ షోలో రవికృష్ణ - నవ్య స్వామి మరోసారి జంటగా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, అతడు ఆమెను ఎత్తుకుని మరీ గాల్లో తిప్పేశాడు. తర్వాత వీళ్ల రిలేషన్ గురించి హోస్ట్ సుడిగాలి సుధీర్ సూటిగా ప్రశ్నించాడు.

  Raahu Movie Entha Chooda Chakkande Full Video Song
  ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చేసిన నవ్య

  ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చేసిన నవ్య

  ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్.. ‘అసలు మీ ఇద్దరి మధ్య ఉంది ఫ్రెండ్‌షిప్పా? లేక' అని అడిగాడు. దీనికి నవ్య స్వామి స్పందిస్తూ ‘వందకు వంద శాతం మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే' అంటూ బదులిచ్చింది. దీంతో తమపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది. ఇక, ఎంతో సందడిగా సాగిన ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం.

  English summary
  Television Heroine Navya Swamy Recently Participated In Sridevi Drama Company Show with Ravi Krishna. In This Show She Gave Clarity about Relation with Ravi Krishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X