For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నవ్య స్వామికి చేదు అనుభవం: పబ్లిక్‌లో అక్కడ టచ్ చేశాడంటూ.. పర్సనల్ మేటర్ లీక్ చేసిన బ్యూటీ

  |

  తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రముఖులకు సమానమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంటున్నారు సీరియల్ నటీనటులు. ఇప్పటికే ఎంతో మంది ఇలా ఎనలేని క్రేజ్‌ను అందుకుని సత్తా చాటారు. ఇప్పుడా జాబితాలోకే వచ్చి చేరింది నవ్య స్వామి. ఏమాత్రం అంచనాలు లేకుండానే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. అదే సయమంలో పలు కారణాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నవ్య స్వామిని పబ్లిక్‌లోనే ఓ వ్యక్తి అసభ్యంగా ముట్టుకున్నాడట. ఆమె రివీల్ చేసిన వివరాలు మీకోసం!

  నవ్య స్వామి కెరీర్ అలా మొదలైంది

  నవ్య స్వామి కెరీర్ అలా మొదలైంది

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు ప్రవేశించింది నవ్య స్వామి. ఈ క్రమంలోనే కన్నడంలో పలు సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపును అందుకుంది. అక్కడ ఎన్నో ధారావాహికల్లో నటించిన ఆమె.. 'తన్‌గాలి'తో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో పాటు సత్తా చాటుతోంది.

  ఆ సీరియల్‌తో నవ్యకు బ్రేక్ వచ్చింది

  ఆ సీరియల్‌తో నవ్యకు బ్రేక్ వచ్చింది

  నవ్య స్వామికి తెలుగులో బ్రేక్‌ను అందుకుంది 'ఆమె కథ' సీరియల్ ద్వారానే. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ఈ ధారావాహిక సూపర్ డూపర్ హిట్ అయింది. మిడిల్ క్లాస్ అమ్మాయి.. ధనవంతుల అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలాంటి కష్టాలను అనుభవించింది అనే కథాంశంతో ఈ సీరియల్ సాగింది. ఇందులో నవ్య స్వామి పాత్ర హైలైట్ అవగా.. రవికృష్ణ హీరోగా నటించాడు.

  వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం అంటూ

  వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం అంటూ

  'ఆమె కథ' సీరియల్‌లో కలిసి నటించిన కారణంగానో.. మరే రీజనో తెలియదు కానీ... రవికృష్ణ - నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో రవికృష్ణ - నవ్య స్వామి తరచూ హైలైట్ అవుతున్నారు. ఫలితంగా వీళ్లపై పుకార్లు మరింతగా షికార్లు చేస్తున్నాయి.

  ఆ షోలో ముద్దులు... ఈ షోలో పెళ్లి

  ఆ షోలో ముద్దులు... ఈ షోలో పెళ్లి


  కొద్ది రోజుల క్రితం 'క్యాష్' షోలో పాల్గొన్న రవికృష్ణ - నవ్య స్వామి రొమాన్స్ చేసి ప్రేమ వార్తలకు మరింత బలం చేకూర్చారు. సుమ ఇచ్చిన టాస్కులో భాగంగా నవ్యసామి... రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. ఆ వెంటనే హగ్ చేసుకున్న అతడు.. ముద్దు పెట్టి షాకిచ్చాడు. ఆ తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా వీళ్లిద్దరికీ పెళ్లి చేశారు. దీంతో వీళ్ల వ్యవహారం మరింత హైలైట్ అయింది.

  క్యాష్ చేసుకుంటోన్న షో యూనిట్లు

  క్యాష్ చేసుకుంటోన్న షో యూనిట్లు

  బుల్లితెరపై తమ తమ ప్రతిభను చూపిస్తూ ఫుల్ బిజీగా సాగిపోతోన్న రవికృష్ణ - నవ్య స్వామి వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. దీంతో ఈ జంట క్రేజ్‌ను వాడుకోవాలని షోల నిర్వహకులు ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక షోకు జంటగా ఆహ్వానిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ ప్రేమికులుగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

  పర్సనల్ మేటర్ లీక్ చేసేసిన నవ్య

  పర్సనల్ మేటర్ లీక్ చేసేసిన నవ్య

  ఇటీవల నవ్య స్వామి 'అలీతో సరదాగా' అనే షోలోకి పాల్గొంది. ఈ సందర్భంగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే పర్సనల్ మేటర్లను సైతం ప్రస్తావించింది. ఇందులో భాగంగానే గతంలో తాను ఓ వ్యక్తిని చితకబాదానని చెప్పుకొచ్చింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చిన నవ్య స్వామి.. దానికి గల కారణాలను కూడా వెల్లడిస్తూ మేటర్‌ను లీక్ చేసేసింది.

  Recommended Video

  RRR Behind Battala Rama swamy Biopikku | Satish Kumar Interview
  పబ్లిక్‌లో అక్కడ టచ్ చేశాడంటూ

  పబ్లిక్‌లో అక్కడ టచ్ చేశాడంటూ

  నవ్య స్వామి దీనిపై వివరణ ఇస్తూ.. 'నేను ఫ్రెండ్స్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ మేమంతా ఎంజాయ్ చేస్తోన్న సమయంలో.. ఈవెంట్ మేనేజర్ వచ్చి పబ్లిక్‌లోనే నన్ను టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే అతడిని చితక్కొట్టాను. కాళ్లతో చేతులతో తన్నాను. ఆ దెబ్బలకు నా చేతులో వాచిపోయాయి. ఆ తర్వాత ఇంటికెళ్లి బాగా ఏడ్చేశాను' అంటూ చెప్పుకొచ్చిందామె.

  English summary
  Television Heroine Navya Swamy Recently Participate In Alitho Saradaga Show. In This Show She Revealed her Personal Secret.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X