twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవికృష్ణతో పెళ్లిపై నవ్య స్వామి సంచలన వ్యాఖ్యలు: వాళ్లు సీరియస్ అయ్యారు.. మ్యారేజ్ చేస్తామంటూ!

    |

    గ్లామర్ ప్రపంచంలో సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలు తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. అది వెండితెరపై కావొచ్చు.. బుల్లితెరపై కావొచ్చు. ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారం సెన్సేషన్‌గా మారుతుంటుంది. ఇక, ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రేమ కహానీల్లో సీరియల్ నటులు రవికృష్ణ - నవ్య స్వామి ట్రాక్ ఒకటి. ఓ సీరియల్ ద్వారా కలుసుకున్న ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సదరు హీరోయిన్ ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

    రవికృష్ణ ఫేమస్ అయింది ఎలాగంటే

    రవికృష్ణ ఫేమస్ అయింది ఎలాగంటే

    యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రవికృష్ణ. 'మొగలిరేకులు' అనే సీరియల్‌లో తెచ్చుకున్న ఈ కుర్రాడు.. ఆ తర్వాత 'వరూధినీ పరిణయం' అనే ధారావాహికతో ఎనలేని క్రేజ్‌ను అందకున్నాడు. హీరోగా మారిన తర్వాత వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు హీరో రవికృష్ణ. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్నాడతను.

    నవ్య స్వామి అలా ఎంటర్ అయింది

    నవ్య స్వామి అలా ఎంటర్ అయింది

    మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది నవ్య స్వామి. ఈ క్రమంలోనే కన్నడంలో పలు సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపును అందుకుంది. అక్కడ ఎన్నో ధారావాహికల్లో నటించిన ఆమె.. 'తన్‌గాలి'తో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి పరిచయం అయిందీ సౌతిండియన్ హీరోయిన్.

    ఆ సీరియల్‌తో ఈ ఇద్దరూ కలిశారు

    ఆ సీరియల్‌తో ఈ ఇద్దరూ కలిశారు

    తమ తమ కెరీర్‌లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రవి కృష్ణ - నవ్య స్వామి.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'ఆమె కథ'లో జంటగా నటించారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మిడిల్ క్లాస్ అమ్మాయి.. ధనవంతుల అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలాంటి కష్టాలను అనుభవించింది అనే కథాంశంతో ఈ సీరియల్ సాగుతోంది.

    అప్పుడు ముద్దు పెట్టడంతో పుకార్లు

    అప్పుడు ముద్దు పెట్టడంతో పుకార్లు

    'ఆమె కథ'లో కలిసి నటించిన కారణంగానో.. మరే రీజనో తెలియదు కానీ... రవి కృష్ణ - నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల క్రితం 'క్యాష్' షోలో పాల్గొన్న వీళ్లిద్దరూ రొమాన్స్ చేశారు. సుమ ఇచ్చిన టాస్కులో భాగంగా నవ్యసామి... రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. ఆ వెంటనే హగ్ చేసుకున్న అతడు.. ముద్దు పెట్టి షాకిచ్చాడు.

    ‘శ్రీదేవీ కంపెనీ' వాళ్లు పెళ్లి చేసేశారు

    ‘శ్రీదేవీ కంపెనీ' వాళ్లు పెళ్లి చేసేశారు

    'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో మరో కామెడీ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రది ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని మల్లెమాలనే రూపొందిస్తోంది. ఇటీవల ఈ షోకు రవికృష్ణ.. నవ్య స్వామి జంటగా ఎంట్రీ ఇచ్చారు. షోలో భాగంగా వీళ్లిద్దరికీ నిర్వహకులు పెళ్లి చేశారు. దీంతో వీళ్ల ప్రేమ వ్యవహారం మరోసారి హైలైట్ అయింది.

    పెళ్లిపై నవ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

    పెళ్లిపై నవ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

    ఈ షో తర్వాత రవి కృష్ణ - నవ్య స్వామి ప్రేమ.. పెళ్లి గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ఈ జంట తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ జోడీపై ఎన్నో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నవ్య స్వామి స్పందించింది. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

    వాళ్లు సీరియస్ అయ్యారంటూ షాక్

    వాళ్లు సీరియస్ అయ్యారంటూ షాక్


    రవికృష్ణతో పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'మేమిద్దరం ప్రేమలో లేము. తను నాకు ఎంతగానో సహాయపడే బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా ఇద్దరి గురించి వస్తున్న వార్తలు చూసి అమ్మానాన్న తొలిసారి ఫీల్ అయ్యారు. తాజాగా అమ్మ ఫోన్ చేసి 'ఏంటి నవ్య? ఏం జరుగుతోంది? అంటూ ఫీలైపోయింది. అంతేకాదు, నీకు సంబంధాలు చూస్తున్నాం అని చెప్పి బాధ పడింది' అంటూ నవ్య చెప్పుకొచ్చింది.

    English summary
    Ravi Krishna is an Indian actor who works in Telugu television industry. He is participating in one of the popular television reality show, Bigg Boss Telugu Season 3 hosted by Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X