For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5లోకి ఫేమస్ హీరోయిన్: ముందే బయటకొచ్చిన మేటర్.. ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్న బ్యూటీ

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుని సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. సరికొత్త కంటెంట్‌తో వచ్చినా ఆడియెన్స్ దీనికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫలితంగా ఈ షో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, త్వరలోనే ఐదో దానిని కూడా మొదలెట్టబోతున్నారు. ఈ సీజన్‌కు తెలుగు సీరియల్ హీరోయిన్ ఎంపికైనట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా నటి? పూర్తి వివరాలు మీకోసం!

  ఒకదానికి మించి ఒకటి సక్సెస్

  ఒకదానికి మించి ఒకటి సక్సెస్

  బిగ్ బాస్‌ షో దేశంలోని చాలా భాషల్లో ఎప్పటి నుంచో ప్రసారం అవుతోంది. అయితే, తెలుగులోకి మాత్రం కొన్నేళ్ల క్రితమే పరిచయమైంది. ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అదే సమయంలో బుల్లితెరపై ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

  ఐదో సీజన్‌పై ఎన్నో ప్రచారాలు

  ఐదో సీజన్‌పై ఎన్నో ప్రచారాలు

  ఆరంభం నుంచి ప్రతి ఏడాది బిగ్ బాస్ ప్రసారం అవుతూ వస్తోంది. అయితే, ఈ సారి మాత్రం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఐదో సీజన్ జరిగేది అనుమానమే అన్న ప్రచారం జరిగింది. దీనికితోడు కొన్ని భాషల్లో ఈ షోను నిలిపేశారు. దీంతో తెలుగులో కూడా అలాగే జరుగుతుందన్న టాక్ వినిపించింది. దీనివల్ల బిగ్ బాస్ ప్రేమికులు నిరాశకు లోనైన విషయం తెలిసిందే.

  ఆరోజు నుంచే సీజన్ ప్రారంభం

  ఆరోజు నుంచే సీజన్ ప్రారంభం

  ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రసారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇది సెప్టెంబర్ 5 సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుందట. అంతేకాదు, ఆగస్టు మొదటి వారంలో లోగోను, చివరి వారంలో ప్రోమోను విడుదల చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

  కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఇలా

  కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఇలా

  బిగ్ బాస్ సీజన్‌కు సమయం వచ్చిందంటే చాలు.. అందులో పలనా కంటెస్టెంట్ పాల్గొంటున్నాడని ఎన్నో పేర్లు తెరపైకి వస్తుంటాయి. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందట. దాదాపు వంద మంది ప్రముఖుల్లో ఇటీవలే షార్ట్ లిస్ట్ తయారు చేశారని అంటున్నారు. వీరితో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరుపుతున్నారని తెలిసింది.

  బిగ్ బాస్‌లోకి ఫేమస్ హీరోయిన్

  బిగ్ బాస్‌లోకి ఫేమస్ హీరోయిన్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొద్ది రోజులుగా చాలా మంది పేర్లు ప్రచారం అవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకూ బయటకు రాని పేరు ఒకటి తాజాగా తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తుందట. ఇప్పటికే ఆమె ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది.

  ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకుంది

  ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకుంది

  నవ్య స్వామి ప్రస్తుతం పలు సీరియళ్లతో బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ను అందుకుంది. ఈ కారణంగానే ఆమెను బిగ్ బాస్ నిర్వహకులు సంప్రదించారని తెలుస్తోంది. అంతేకాదు, ఇందుకోసం ఆమెకు భారీ మొత్తం ఆఫర్ చేశారని అంటున్నారు. అందుకే షోలో పాల్గొనేందుకు నవ్య స్వామి ఒప్పుకుందని బుల్లితెర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు
  నవ్య స్వామి బ్యాగ్రౌండ్ ఏంటంటే?

  నవ్య స్వామి బ్యాగ్రౌండ్ ఏంటంటే?

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు ప్రవేశించింది నవ్య స్వామి. ఈ క్రమంలోనే కన్నడంలో పలు సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ చేసింది. అందులో ‘ఆమె కథ' ఆమెకు గుర్తింపును తెచ్చింది. అదే సమయంలో సీరియల్ హీరో రవికృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో నవ్య బాగా ఫేమస్ అయింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show Makers Planing for 5th One. Television Heroine Navya Swamy Selected for This Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X