Bigg Boss Voting : భయపెడుతోన్న ఓటింగ్ .. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, షాకిచ్చేలా ఎలిమినేషన్?

బిగ్‌బాస్ తెలుగు 8లో 9వ వారం ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. హౌస్‌కి కొత్త మెగా చీఫ్‌గా అవినాష్ ఎంపికవ్వగా.. శనివారం సాయంత్రం నాగార్జున ఈ వీక్‌లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్‌పై హోస్ట్ అక్కినేని నాగార్జున రివ్యూ చేయనున్నారు. ఈ వారం ఐదుగురు టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండటంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటింగ్‌లో ఎవరు టాప్‌‌లో ఉన్నారు? 9వ వారానికి సంబంధించి ఓటింగ్‌ ఎలా జరుగుతుంది? అనేది ఒకసారి చూస్తే :

బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లలో గెలిచి ముక్కు అవినాష్ ఈ వారం మెగా చీఫ్ అయ్యాడు. అయితే నబీల్ ఏమాత్రం పోటీ ఇవ్వకుండా త్యాగశీలి మాదిరిగా మరోసారి మెగా చీఫ్ అయ్యే అవకాశం వచ్చినా వదిలేసుకున్నాడు. నేను ఒకసారి మెగా చీఫ్ అయ్యాను కదా.. ఈసారి నువ్వు అవ్వాలని గివ్ అప్ ఇచ్చేశాడు నబీల్. దీంతో అవినాష్‌ని విన్నర్‌గా ప్రకటించగా.. విష్ణుప్రియ చీఫ్ బ్యాండ్ తీసి అవినాష్ చేతికి కట్టింది.

Nayani pavani and hari teja in danger zone in 9th week Voting in bigg boss telugu 8

ఇక హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ పోటీ పడి ముగ్గులేశారు. పండగ కావడంతో బిగ్‌బాస్ హౌస్‌మెట్స్‌కి స్వీట్లు పంపించాడు. అవినాష్ మెగా చీఫ్ కావడంతో అతని ఫోటోని మెగా చీఫ్ స్లాట్‌లో పెట్టాలని ఆదేశించాడు. ఆ కాసేపటికీ పృథ్వీ, నబీల్‌కు ఫ్యామిలీ మెంబర్స్‌కి సంబంధించిన వీడియో చూసే అవకాశం కల్పించాడు. అది మీరే తేల్చుకోవాలని చెప్పడంతో పృథ్వీ త్యాగం చేసి నబీల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో స్క్రీన్‌పై నబీల్ సోదరుడు, తల్లి కనిపించారు.

Nayani pavani and hari teja in danger zone in 9th week Voting in bigg boss telugu 8

తర్వాత టేస్టీ తేజ వాళ్ల పేరెంట్స్‌తో , నయని వాళ్ల అక్క, రోహిణి మదర్, విష్ణు అమరావతి ఆంటీతో, పృథ్వీ వాళ్ల తమ్ముడితో , యష్మి తన పేరెంట్స్‌తో, హరితేజ తన తల్లి కూతురుతో మాట్లాడారు. అనంతరం హౌస్‌మేట్స్ అందరికీ బిగ్‌బాస్ క్రాకర్స్ పంపించడంతో ఇంటి సభ్యులు ఎంజాయ్ చేశారు. కాకపోతే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సిన పండుగను బయట జరుపుకోవడంతో అంతా ఎమోషనల్ అయ్యారు.

Nayani pavani and hari teja in danger zone in 9th week Voting in bigg boss telugu 8

ఇకపోతే.. 9వ వారం ఐదుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారు. వారు గౌతమ్ కృష్ణ, యష్మీగౌడ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్‌ను బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారో, ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి చూస్తే. ఎప్పటిలాగే యష్మీ గౌడ 35 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా.. గౌతమ్ కృష్ణ 29.16 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత వరుసగా టేస్టీ తేజ (24.07) శాతం, హరితేజ (21.32) శాతం, నయని పావని (17.69) శాతం ఓటింగ్‌తో నిలిచారు. ప్రస్తుతానికి హరితేజ, నయని పావనిలు డేంజర్ జోన్‌లో ఉండగా.. వీరిద్దరిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. అదెవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X