Bigg Boss Buzzz : ఏడుపులు పెడబొబ్బలే.. నీ గేమ్ ఏది, ఆధారాలతో నయని పరువు తీసిన అర్జున్ అంబటి

బిగ్‌బాస్ తెలుగు 8లో 9వ వారం అనూహ్య పరిణామాల మధ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయని పావని ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ 7లో కంటెస్టెంట్‌గా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయిన నయని మరోసారి తనకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పారు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి కేవలం నాలుగు వారాలకే ఇంటిని వీడారు. ఎలిమినేషన్ అనంతరం అర్జున్ అంబటికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయని పావని తన జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే .

బిగ్‌బాస్ తెలుగు 8లో 9వ వారం యష్మి గౌడ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, హరితేజ, నయని పావనిలు నామినేషన్స్‌లో నిలిచారు. ఒక్కొక్కరు సేవ్ అవ్వగా చివిరికి హరితేజ , పావని నిలిచారు. దీంతో వారిద్దరిని యాక్టివిటీ రూమ్‌కి పిలిచారు నాగార్జున. ఇద్దరి ముందు రెండు ఫోటో ఫ్రేమ్స్ పెట్టి సుత్తితో పగులగొట్టమన్నారు. అందులో నయని పావని ఎలిమినేటెడ్ అని రావడంతో ఈమె ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. హౌస్‌లో ఇన్ని రోజులు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి .. అందరికీ వీడ్కోలు పలికి స్టేజ్ మీదకి వచ్చింది.

Nayani Pavani Bigg Boss Buzzz Interview with arjun Ambati after elimination from bigg boss telugu 8

అయితే ప్రతిసారి ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నప్పటికీ నయని ఏదో ఒక రకంగా సేవ్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ టీమ్ కూడా ఏం చేయలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నామినేషన్స్ చేసేటప్పుడే ఈమె డొల్లతనం బయటపడిపోయింది. ఏ రీజన్‌పై ఎవరిని నామినేట్ చేయాలో, ఎలా చేయాలో తెలియక, అసలే ఏ పాయింట్ మాట్లాడాలో తెలియక నయని తడబడింది. ఈమె ఆట తీరుపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అన్నింటికి మించి ప్రతిదానికి ఏడవటంతో నయని ఆటతీరు ఎవరికీ నచ్చలేదు. ఓవర్ ఎమోషనల్ అయిన నాగ మణికంఠ తర్వాత రూట్ మార్చి టాస్క్‌లలో దిగాడు. అతనిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందిపోయి .. కళ్ల వెంట నీటిని తెచ్చుకుని ఓట్లు పొందాలని చూసింది. కానీ ప్రేక్షకులు ఆమెకు షాకిచ్చారు.

ఎలిమినేట్ అయిన తర్వాత అర్జున్ అంబటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయని పావని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చి రాగానే ఆమె మెడలో మెడల్ వేస్తాడు అర్జున్ అంబటి. మీరు హౌస్‌లో ఉన్న ఈ నాలుగు వారాలు స్క్రీన్‌లో ఎక్కువ కనిపించింది ఏంటో తెలుసా అని అర్జున్ అడిగి స్క్రీన్‌పై వేసి చూపిస్తాడు. అందులో ప్రతిసారి నయని పావని ఏడుస్తున్న సీన్లు ఉంటాయి.. అవి చూసుకుని ఆమె పగలబడి నవ్వుతుంది. సీజన్ 7లో ఉన్న నయనికి సీజన్ 8లో ఉన్న నయనికి డిఫరెన్స్ ఏంటీని ప్రశ్నించగా.. రెండు సీజన్లు వేటికవే డిఫరెంట్ అని అంటుంది.

మీరు నామినేషన్స్‌లో ఉన్నప్పుడే ఎలిమినేషన్ అయిపోతానని భయం వేసిందా , నామినేషన్స్ కూడా అర్ధం కానిది నీకు ఒక్కదానికేనని అర్జున్ సెటైర్లు వేస్తాడు. నామినేషన్స్ టైంలో నేను ఎలా మాట్లాడానో నాకు క్లారిటీ ఉందని ఆన్సర్ ఇస్తుంది నయని. లాస్ట్ సీజన్‌లో ఫాదర్ సెంటిమెంట్, ఈ సీజన్‌లో మణికంఠతో బ్రదర్ సెంటిమెంట్ అంటూ నయనిపై నెటిజన్లు పెట్టిన కామెంట్స్‌ని చూపించాడు అర్జున్. మరి తన జర్నీపై ఆమె ఏ వ్యాఖ్యలు చేశారు? ఎందుకిలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది? అనే దానిపై నయని పావని ఏం చెప్పారో తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X