Nayani Pavani: "యావర్ అంటే నాకిష్టమే.. మా జంట అందరికీ నచ్చుతుంది.. అందుకే అలా ముందుకెళ్తున్నాం"

బిగ్ బాస్ తెలుగు 7షోలో కంటెస్టెంట్లు పాల్గొని తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాధించుకున్న ప్రిన్స్ యావర్, నయని పావనిల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరూ కలిసి గత కొంత కాలంగా వీడియోలు చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని అంతా అనుకుంటున్నారు. ఇటీవలే యావర్ కూడా నయనికి నువ్వంటే నాకిష్టం అని చెప్పాడని నయని రివీల్ చేసింది. తాజాగా తన మనసులోని మాటను.. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ తో తన బంధంపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నయని పావని అతి తక్కువ సమయంలోనే స్పై బ్యాచ్ తో క్లోజ్ అయింది. ముఖ్యంగా శివాజిని నాన్న అంటూ యావర్ తో లవ్ ట్రాక్ నడిపింది. యావర్ కూడా రతికాతో పులిహోర కలిపినట్లు కాకుండా.. ఈమె విషయంలో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు. అయితే హౌస్ లోంచి బయటకు వచ్చినప్పుడు వీళ్లతో ఎక్కువ కాలం గడపలేకపోయినందుకు చాలా ఎమోషనల్ అయింది. అయితే వాళ్లు బయటకు వచ్చిన తర్వాత నుంచి చాలా సార్లు కలుస్తూ.. బంధం కొనసాగిస్తోంది.

Nayani Pavani Clarrity Abbout Her Relation With Prince Yawar Check Details

పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా వీరితో బంధాన్ని సాగిస్తున్న ఈమె తాజాగా ప్రిన్స్ యావర్ వీడియో సాంగ్ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చింది. ఆరోగ్యం బాగాలేకపోయినా అతడి కోసం రావడంతో అంతా షాక్ అయ్యారు. అతడిపై ప్రేమ ఉంది కాబట్టే వచ్చిందని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై నయని పావని స్పందించింది. ప్రిన్స్ యావర్ కు తాను అంటే ఇష్టం అని గతంలోనే చెప్పాడని.. అయితే తనకు కూడా అతడంటే ఇష్టమేనని వివరించింది.

Nayani Pavani Clarrity Abbout Her Relation With Prince Yawar Check Details

కానీ అంతా అనుకుంటున్నట్లుగా అది ప్రేమ కాదని.. మంచి స్నేహం మాత్రమేనని నయని పావని వెల్లడించిందిం. అయితే తామిద్దరూ కలిసి చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్ చాలా పాపులర్ కావడం.. ఈ ఒక్క సాంగ్ వల్ల తమకు అనేక మంది సబ్ స్క్రైబర్లు, ఫాలోవర్లు వచ్చారని నయని పావని స్పష్టం చేసింది. ఎంతో మంది మీ జంట నచ్చింది, మిమ్మల్ని ఇద్దరినీ కలిపి చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం చూస్తుంటే తనకు బాగా అనిపిస్తుందని.. అందుకే తామిద్దరూ కలిసి కనిపించాలనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

Nayani Pavani Clarrity Abbout Her Relation With Prince Yawar Check Details

కేవలం వీడియోల్లో మాత్రమే కాకుండా... ఎక్కువగా కలిసి అందరికీ కనిపించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇలాగే తమ జంటను ఆదరిస్తే.. తాము కెరియర్ లో పైకి రావడానికి చాలా హెల్ప్ అవుతుందని నయని పావని వివరించింది. మరి ఇప్పుడు వీడియోలు, ఫేమ్ కోసం మాత్రమే కలిసి పని చేస్తున్న ఈ జంట.. ఫ్యూచర్ లో ప్రేమ బంధంతో ఒక్కటి అవుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X