Bigg Boss Voting : అనూహ్యంగా మారిన ఓటింగ్ , ఏడ్చినా పడని ఓట్లు.. దారుణంగా ఆమె పరిస్ధితి

బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా 9వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఆటలో వేగం పెరిగింది. ఆల్‌ మోస్ట్ మిడ్‌ వీక్‌కి చేరుకోవడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ వారం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండటంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఓటింగ్‌లో ఎవరు టాప్‌‌లో ఉన్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌లో 9 వారానికి సంబంధించి ఓటింగ్‌ ఎలా జరుగుతుంది? అనేది ఒకసారి చూస్తే :

నామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత హౌస్‌లో చీఫ్ కంటెండర్స్ కోసం టాస్క్‌లు ప్రారంభించాడు బిగ్‌బాస్. రాయల్, ఓజీ క్లాన్‌లను కలిపేసి ఇకపై ఒక్కటే టీమ్ ఉంటుందని చెప్పిన బిగ్‌బాస్ .. బీబీ ఇంటికి దారేది గేమ్ ఆడిస్తున్నాడు. మంగళవారం ప్రేరణ, యష్మిలపై నిఖిల్ విధ్వంసం చూసి ప్రేక్షకులు వణికిపోయారు. దీనిపై మండిపడ్డ గౌతమ్.. నిఖిల్‌ మీదకి వెళ్లడంతో ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. ఇంటి సభ్యులు వారిని విడదీయడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.

Nayani pavani danger zone in 9th week Voting in bigg boss telugu 8

బుధవారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రేరణ, యష్మి తనను అర్ధం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ ఒక్కటైపోయారని, నేను ఒంటరిని అయ్యానని .. ఇకపై నా గేమ్ నేను ఆడతానని తేల్చిచెప్పాడు. బుధవారం జరిగిన టాస్క్‌లో యెల్లో టీమ్ నుంచి నయని పావని, పృథ్వీ ఆడగా.. రోహిణి అన్న మాటలతో నయని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఇప్పటి వరకు పెట్టిన టాస్క్‌లలో బ్లూ టీమ్ రెండు, గ్రీన్ టీమ్ ఒకటి, రెడ్ టీమ్ ఒకటి గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ వారం చీఫ్ కంటెండర్ ఎవరు అవుతారోనని ఉత్కంఠ నెలకొంది.

ఇకపోతే.. 9వ వారం ఐదుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు గౌతమ్ కృష్ణ, యష్మీగౌడ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్‌ను బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారో, ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి చూస్తే. ఓటింగ్‌ మొదలైన నాటి నుంచి యష్మీ గౌడ నెంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. వరుసగా మూడో రోజు కూడా ఓటింగ్‌లో ఆమె టాప్ ప్లేస్‌లో నిలవటం విశేషం.

Nayani pavani danger zone in 9th week Voting in bigg boss telugu 8

దాదాపు 38 శాతం ఓటింగ్‌తో యష్మి గౌడ అగ్రస్థానంలో ఉండగా.. గౌతమ్ 31.07 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాత వరుసగా టేస్టీ తేజ (27.16) శాతం, హరితేజ (22.14) శాతం ఓటింగ్‌తో నిలిచారు. నిన్నటి వరకు నాలుగో స్థానంలో కాస్తంత సేఫ్ జోన్‌లో ఉన్న నయని పావని తాజా ఓటింగ్‌లో వెనుకబడిపోయారు. (16.82) శాతం ఓటింగ్‌తో ఆమె డేంజర్ జోన్‌లో నిలిచారు. ఇంకా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి చాలా సమయం ఉండటంతో ఫలితాలు, ర్యాంకింగ్స్ ఎలా మారుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X