Bigg Boss Telugu 7 నేను సింగిల్.. బాయ్‌ఫ్రెండ్ లేడు.. కంటెస్టెంట్‌కు సిగ్నల్ ఇచ్చిన నయని పవని
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకొంటున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ముగ్గురు లేడి కంటెస్టెంట్లు రావడంతో బిగ్‌బాస్ హౌస్ కలర్‌ఫుల్‌గా మారిపోయింది. ఇంటిలోకి వచ్చిన అశ్వినీ శ్రీ బోల్డుగా కనిపిస్తుంటే.. నయని పవని మాత్రం గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకొంటున్నది. అయితే బిగ్‌బాస్ తెలుగు7 సీజన్‌లో ఇప్పటి వరకు పెద్దగా లవ్ ట్రాక్‌లు నడవలేదు. అయితే పల్లవి ప్రశాంత్, రతిక రోజ్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే భావించిన వారికి నిరాశే మిగిలింది. అయితే తాజాగా ఇంటిలో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ప్రేమ వ్యవహారం చిగురిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లోని ఇంటిలో ఆరంభంలో రతిక రోజ్ చుట్టు అబ్బాయిలు కన్నేశారు. అయితే పల్లవి ప్రశాంత్, రతిక రోజ్ మధ్య సున్నితమైన రొమాంటిక్ ట్రాక్ మొదలైనట్టు కనిపించింది. అయితే ఆ లవ్ ట్రాక్ ఎక్కువగా ముందుకు వెళ్లలేదు. వారి మధ్య చిలిపి సన్నివేశాలు మాత్రం కొద్ది రోజుల ప్రేక్షకులను ఆలరించాయి.

అయితే పల్లవి ప్రశాంత్ , రతిక రోజ్ రొమాంటిక్ ట్రాక్‌కు వెంటనే బ్రేక్ పడింది. వారిద్దరూ గొడవపడి ఒకరినొకరు నిందించుకొన్నారు. నాతో నీవు మాట్లాడకు అంటూ ప్రశాంత్‌ను రతిక అంటే.. చివరకు అక్కా అంటూ ప్రశాంత్ ప్లేట్ ఫిరాయించాడు. దాంతో నీవు అక్క అనడం ఏంటిరా? నీవు అక్క గానీ..మరో మాట గానీ నాతో అనకు అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత ఏ కంటెస్టెంట్ మధ్య పెద్దగా లవ్ ట్రాక్ నడిచినట్టు కనిపించలేదు.

తాజాగా ప్రిన్స్ యావర్‌పై కొందరు లేడి కంటెస్టెంట్లు మనసు పారేసుకొన్నట్టు కనిపించినా.. అది ముందుకు సాగలేదు. అయితే ఇంటిలోకి నయన పవని వచ్చిన తర్వాత యావర్‌కు ఆమె దగ్గరయ్యారు. వారిద్దరి మధ్య కొద్ది రోజులుగా చిన్న చిన్న చిలిపి సంఘటనలు కనిపించాయి. వారి మధ్య ఓ రకమైన కెమిస్ట్రీ కనిపించింది.
అయితే ఇటీవల ప్రిన్స్ యావర్, నయన పవని మధ్య చిలిపి సంభాషణ ఆసక్తిని రేపింది. నీవు ఎంగేజ్‌డా? అంటే.. నవ్వుతూ అడిగితే.. నయన పవని చిలిపిగా నవ్వుతూ సమాధానం చెప్పింది. నేను ఎంగేజ్డ్ కాదు.. నేను ఇంకా సింగిల్‌లే. నాకు బయట బాయ్‌ఫ్రెండ్ ఎవరు లేరు అని ఆమె చెప్పింది.

అయితే నయన పవని ఇచ్చిన సిగ్నల్‌ను యావర్ పాజిటివ్‌గా తీసుకొంటాడా? వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నయని, యావర్ ప్రేక్షకులకు ఏ రకంగా వినోదాన్ని పంచుతారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా అంశంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











