Bigg Boss Telugu 7: శోభా శెట్టిని ఎలిమినేషన్ నుంచి తప్పించిన బిగ్‌బాస్.. బలైన మరో బ్యూటీ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ అంటే.. అంతా ఫన్. ఇక హౌజ్ సభ్యులు మాత్రం వారం మొత్తం ఎలా ఉన్నా.. వారంతంలో మాత్రం నీట్ గా రెడీ అయి మేకప్ లు వేసుకుని కూర్చుంటారు. ఇక నాగార్జున చెప్పిన సంగతులు వింటూ గేమ్స్ ఆడుతూ అలరిస్తారు. ఇక ప్రతివారం ఓ ఎలిమినేషన్ ఉన్నట్లే ఈ వారం కూడా ఓ ఎలిమినేషన్ ఉంది. అయితే అందరూ అనుకున్నట్లు ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కాలేదు. ఆమెను బిగ్ బాస్ సేవ్ చేశాడు. దానికి ఓ కారణం ఉంది. అయితే ఈ వారం శోభాశెట్టిని కాపాడటానికి కొత్తపాపను బలి చేశాడు బిగ్ బాస్. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టాగానే సాగుతోంది. అసలు ప్రతి వారం ప్రేక్షకులకు షాకులు, ట్విస్టులు ఇస్తూ.. బిగ్ బాస్ మాత్రం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు. గత సీజన్స్ పోలిస్తే... ఈ సారి సీజన్ మాత్రం రంజుగా సాగుతోంది. ఇక చూడని వారికి కూడా ఆసక్తి కలిగించేలా ఈసారి షోను రన్ చేస్తున్నారు. ఇక ఐదో వారంలో అసలైనా ఉల్టా పుల్టా షాక్ ఇచ్చిన బిగ్ బాస్... ఈ ఆరో వారంలో మరో షాక్ ఇచ్చాడు.

ఐదో వారంలో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో సీరియల్ హీరో అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అశ్విని శ్రీ, ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నయని పవని ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్.. పాత కంటెస్టెంట్ ను కాపాడటానికి కొత్త పాపను బలి చేశాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది... ఏడుగురు ఉన్నారు. శోభా శెట్టి, టేస్టీ తేజ, నయని పవని, అమర్ దీప్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం శోభా శెట్టి, పూజా మూర్తి, నయని పవని ఉన్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే... లేదా ఆట పరంగా చూసుకుంటే... ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శోభా శెట్టి అని అంతా అనుకున్నారు. అయితే అనుకున్నట్లు జరిగింతే బిగ్ బాస్ ఉల్టా పుల్టా ఎలా అవుతుంది.. ఆమెను సేఫ్ చేసి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు.

మరి ఆరో వారంలో శోభా శెట్టిని సేఫ్ చేసి... కొత్తగా వచ్చిన బ్యూటీ నయని పవనిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీల్లో బాగా ఆడేది అంటే మాత్రం అర్జున్, నయనిలు. అలాంటిది ఈ పాపను మొత్తానికి బిగ్ బాస్ బలి చేశాడు. దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. శోభా శెట్టి వచ్చే ముందే ఇన్ని వారాలు ఉంటాను అని ఒప్పందం చేసుకుని వచ్చిందని టాక్ వినిపిస్తుంది. అందుకు ఆమెను బిగ్ బాస్ సేఫ్ చేశాడు అని ఇన్ సైడ్ టాక్.
ఇక కొత్త పాప నయని పవని గురించి వస్తే.. ఇప్పుడిప్పుడే హౌజ్ లో తన ఆటను నిరూపించుకుంటుంది. అసలు ప్రిన్స్ క్యాప్టెన్ కావడానికి కారణమే ఈ పాప. ఇక ప్రిన్స్ తో లవ్ ట్రాక్ ఉండబోతుంది అనుకునే లోపే.. బిగ్ బాస్ ఇలా చేశాడు. మొత్తానికి ఈ పాప ఈ వారానికి కేవలం 2లక్షల రెమ్యూనరేషన్ తో ఇంటికి వెళ్తోంది. చూడాలి మరి ఈ వారంలో ఇంకా ఏమైనా బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడో లేదో అని.


Click it and Unblock the Notifications











