Bigg Boss Telugu 8 Voting : తారుమారైన ఓటింగ్ .. షాకిచ్చేలా ఈ వారం ఎలిమినేషన్?
మరికొద్దిగంటల్లో బిగ్‌బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ముగియనుంది. వీకెండ్ అంటే ఆటపాటలతో పాటు ఖచ్చితంగా ఎలినేషన్ గ్యారంటీ. ఈ వారం కూడా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు 8వ వారానికి గాను హౌస్‌ను వీడనున్నారు. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఓటింగ్‌లో ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? లాస్ట్ మినిట్‌లో బిగ్‌బాస్ షాకిస్తాడా? అంటూ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాల్లోకి వెళితే..
గత రెండు రోజులుగా మెగా చీఫ్ కోసం హౌస్‌లో టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు బిగ్‌బాస్. టాస్క్‌లు ముగిసేసరికి రోహిణి, పృథ్వీ, నిఖిల్, ప్రేరణలు చీఫ్ కంటెండర్లుగా నిలిచారు. అయితే రెండు టీమ్స్ నుంచి మరో ఇద్దరు కంటెస్టెంట్స్‌ని కూడా చీఫ్ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. దీంతో ఓజీ క్లాన్, రాయల్ క్లాన్‌లు డిస్కస్ చేసుకుని ఓజీ నుంచి విష్ణుప్రియ, రాయల్ టీమ్ నుంచి టేస్టీ తేజలను చీఫ్ కంటెండర్లుగా ప్రకటించారు.

8వ వారానికి మెగా చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. ఆ బాధ్యతను కంటెస్టెంట్స్‌కే అప్పగించాడు. చీఫ్ కంటెండర్స్‌గా ఉన్న వారిలో మెగా చీఫ్ అయ్యే అర్హత ఎవరికి ఉండదని భావిస్తున్నారో వారి మెడలో పూల మాలలు తీసి మిరపకాయ దండలు వేసి తగిన కారణాలు చెప్పాలి. ఓటింగ్ ముగిసే సరికి ఎవరి మెడలో ఎక్కువ పూల మాలలు ఉంటాయో వారే మెగా చీఫ్ అవుతారని బిగ్‌బాస్ చెబుతాడు. ఒకసారి మిరపకాయ దండ పడితే ఆ కంటెస్టెంట్ పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
రాయల్ టీమ్ మెంబర్స్ తక్కువ ఉండటంతో హరితేజ ఓ ప్లాన్ వేస్తుంది. పృథ్వీ చీఫ్ అయితే తట్టుకోలేమని చెప్పి అతనిని లేపేయాలని అంటుంది. అవినాష్ చేతికి మిరపకాయ దొరకగానే మరో ఆలోచన లేకుండా పృథ్వీని లేపేశాడు. చివరికి నిఖిల్- విష్ణులు మిగలగా ఓ లేడీ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానని చెప్పి నిఖిల్ మెడలో మిరపకాయ దండ వేయడంతో విష్ణు ఊహించని విధంగా మెగా చీఫ్ అయ్యింది. దీంతో తనను చీఫ్‌ని చేసిన హౌస్ మొత్తానికి సాష్టాంగ పడింది విష్ణు.

ఇదిలాఉండగా .. ఈ వారం ప్రేరణ, నిఖిల్ , పృథ్వీరాజ్, నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియలు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ఒకసారి చూస్తే.. నిఖిల్ మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచి తన సత్తా చూపించాడు. నిఖిల్ (28.69 శాతం), ప్రేరణ (27. 2 శాతం) ఓటింగ్ దక్కించుకున్నారు. విష్ణుప్రియ (16.49 శాతం), పృథ్వీరాజ్ (13 శాతం), మెహబూబ్ (12.41 శాతం), నయని పావనికి (8.4 శాతం) ఓటింగ్ దక్కింది. అయితే 8వ వారం నయని పావని ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











