యావర్ ముందే మరో వ్యక్తితో నయని పావని రొమాన్స్.. తట్టుకోలేక అలా అడగ్గా కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ!

బిగ్ బాస్ తెలుగు 7షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనుసులు గెలుచుకున్న టాప్ 5 కంటెస్టెంట్లను అయితే అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా స్పై బ్యాచ్ లో ఒకడిగా తిరిగిన ప్రిన్స్ యావర్ గురించి.. ఆయన నయని పావనితో కలిపిన పులిహోర గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఎంతగానో ఇష్టపడే నయని పావని మరో వ్యక్తితో కలిసి రొమాన్స్ చేసింది. అది చూసి తట్టుకోలేకపోయిన యవర్ ఓ ప్రశ్న అడగ్గా.. ఆమె స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నయని పావని అతి తక్కువ సమయంలోనే స్పై బ్యాచ్ తో క్లోజ్ అయింది. ముఖ్యంగా శివాజిని నాన్న అంటూ ఆయన తమ్ముడిగా చెప్పుకుంటున్న యావర్ తో లవ్ ట్రాక్ నడిపింది. యావర్ కూడా రతికాతో పులిహోర కలిపినట్లు కాకుండా.. ఈమె విషయంలో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు. అయితే హౌస్ లోంచి బయటకు వచ్చినప్పుడు వీళ్లతో ఎక్కువ కాలం గడపలేకపోయినందుకు చాలా ఎమోషనల్ అయింది. కానీ బయటకు వచ్చిన తర్వాత నుంచి మాత్రం వీరితో బాగానే టైమ్ స్పెండ్ చేస్తోంది.

Nayani Pavani Romance With Another Person Infornt of Prince Yawar Check Details

ముఖ్యంగా యావర్ తో కలిసి వీడియోలు చేయడం, డ్యాన్సులు చేయడం కూడా చేసింది. ఇలా అందరు మెచ్చిన జోడీగా మంచి పేరు తెచ్చుకున్న వీళ్లు ఆ తర్వాత కూడా ఇలాగే తమ రిలేషన్ కొనసాగిస్తూ కలిసి కెరియర్ లో ఎదుగుతామని చెప్పారు. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ నీతోనే డ్యాన్స్ 2.0 షోకి వచ్చాడు. ఈక్రమంలోనే అంతా నయని పావనితో కలిసి వస్తాడని అనుకోగా.. తాను మాత్రం వేరే అమ్మాయితో వచ్చాడు. వాసంతి కృష్ణన్ తో కలిసి అతడు డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ షోలోకి నయని పావని కూడా ఎంట్రీ ఇచ్చింది.

ముఖ్యంగా బిగ్ బాస్ గత సీజన్లలో పాల్గొన్న విశ్వతో కలిసి నయని పావని రొమాంటిక్ స్టెప్పులు వేసింది. విశ్వ.. నేహా చౌదరితో కలిసి డ్యాన్సులు చేయగా.. ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఈక్రమంలోనే అతడు వేరే వాళ్లతో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా తన పార్టనర్ హెల్త్ బాలేకపోవడంతో.. తాను మరో పార్టనర్ ను తెచ్చుకున్నట్లు చెప్పాడు. అప్పుడే నయని పావని స్టేజీ మీదకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. అయితే ఇదంతా చూసిన ప్రిన్స్ యావర్ చాలా హర్ట్ అయ్యాడు. ఆమె డ్యాన్స్ చేస్తున్నంత సేపు తదేకంగా చూస్తూనే ఉన్నాడు.

Nayani Pavani Romance With Another Person Infornt of Prince Yawar Check Details

అయితే డ్యాన్స్ అయిపోయాక.. ప్రిన్స్ యావర్ నువ్వు అతడు బాగా మార్కులు స్కోర్ చేయాలని మధ్యలో వచ్చావా అంటూ ప్రశ్నించాడు. అదంతా విన్న నయని పావని కన్నీళ్లు పెట్టుకుంది. నాకు మాత్రమే తెలుసు నేను ఎంత బాధ పడుతున్నానో.. నేను మాత్రమే నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మను ఎవరు చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఏడవడం మాత్రం ఆపలేదు. ఇలా కంటిన్యూస్ గా కన్నీళ్లు పెట్టుకూనే ఉంది. అయితే మొదట్లో ఆరోగ్యం బాగాలేకే.. నయని పావనితో యావర్ కు జోడీగా రాలేకపోయింది. కానీ మధ్యలో మరొకరితో రావడాన్ని యావర్ తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X