Bigg Boss Telugu 7: యావర్‌ని కెప్టెన్ చేసిన లేడీ కంటెస్టెంట్... హౌస్‌లో రెండో లవ్ ట్రాక్ షురూ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆరు వారాలు కావొస్తుంది. ఇక మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అయితే... నెక్ట్స్ క్యాప్టెన్ కోసం టాస్కులు నిర్వహించాడు బిగ్ బాస్. ఇక ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యావర్... ఇప్పటికి సాధించాడు. మొదటి నుంచి అన్నింట్లో తన ప్రతిభను చూపిస్తూ.. ఆకట్టుకున్న యావర్ ఎట్టకేలకు కెప్టెన్ అయిపోయాడు. అది కూడా లేడీ కంటెస్టెంట్ వల్లే. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అనంతరం హౌజ్ లో కొత్తగా వచ్చిన పోటుగాళ్లు, పాత కంటెస్టెంట్స్ ఆటగాళ్ల మధ్య టాస్కులు, గేమ్స్ నిర్వహించారు. ఇక ఈ గేమ్స్ లో ఆటగాళ్లు పై చేయి సాధించారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఆటగాళ్లలో ఎవరు కెప్టెన్సీ అవ్వాల్లో మళ్లీ బిగ్ బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇక ఈ ఆటలో మొత్తానికి ప్రిన్స్ యావర్ గెలిచాడు. అది కూడా లేడీ కంటెస్టెంట్ నయని సాయంతో.. ఇక రెండో క్యాప్టెన్ గా యావర్ ఎంపిక అయ్యాడు.

Bigg Boss Telugu Season 7 Oct 13th Episode

అసలు ఏం జరగిందంటే... ఆటగాళ్ల టీమ్ నుంచి ఎవరు కెప్టెన్ అవ్వాలన్నది డిసైడ్ చేయడానికి బిగ్ బాస్... అందరి మెడలో బెలూన్స్ కట్టుకోమన్నాడు. ఆ తర్వాత ఒక పిన్ పెట్టి.. బజర్ కొట్టినప్పుడు పోటుగాళ్ల నుంచి ఎవరైతే ఆ పిన్‌ ను మొదటగా పట్టుకుంటారో వాళ్లకి ఒక పవర్ ఇచ్చాడు. ఆ పిన్‌ను ఆటగాళ్లలో ఎవరో ఒకరికి వాళ్లకి నచ్చిన వాళ్లకి ఇవ్వాలి. అలా ఆ పిన్ తీసుకున్న ఆటగాడు.. మిగిలిన ప్లేయర్ బెలూన్ పగులగొడతాడు. అప్పుడు వాళ్లు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారు.

మొదట పిన్ ను పూజా పట్టుకుని సందీప్ కు ఇచ్చింది. దీంతో సందీప్.. వెంటనే శివాజీ బెలూన్ పగలగొట్టాడు. అన్నా మీకు చెయ్యి బాలేదు ఆ రీజన్ చెప్పి... బెలూన్ పగులగొట్టాడు. ఇక ఆ తర్వాతి రౌండ్‌లో భోలే పిన్ తీసుకొని రైతుబిడ్డకి ఇచ్చాడు. దీంతో ప్రశాంత్.. ప్రియాంక బెలూన్ పగలగొట్టి ఈ వారం గేమ్ పెద్దగా ఆడలేదనే రీజన్ చెప్పాడు. నెక్ట్స్... నయనికి పిన్ దొరికింది. దీంతో సందీప్ చేతికి ఇచ్చింది. సందీప్... ప్రశాంత్ బెలూన్ పగలగొట్టేశాడు.

ఆ తర్వాత అశ్విని పిన్ తీసుకెళ్లి శోభాకి ఇచ్చింది. దీంతో శోభా ఏమాత్రం ఆలోచించకుండా సందీప్ బెలూన్ పగలగొట్టింది. నెక్ట్స్ పిన్... యావర్ చేతిలో గౌతమ్ పెట్టగా.. అతను శోభా బెలూన్ పగలగొట్టాడు. ఇక కెప్టెన్ రేసులో యావర్-తేజ-అమర్ మిగిలారు. సరిగ్గా అప్పుడే పిన్ తీసుకొచ్చి తేజ చేతిలో పెట్టాడు అర్జున్. దీంతో తేజ ఆలోచించకుండా అమర్ బెలూన్ గుచ్చేశాడు. ఇక చివరిగా తేజ-యావర్ కెప్టెన్సీ రేసులో మిగిలారు.

ఇక ఇక్కడ క్యాప్టెన్ ఎవరో తేల్చే సమయం.. బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశాడు. ముందుగా ఎవరైతే పిన్ తీసుకుంటారో వాళ్లే కెప్టెన్ ఎవరు అవ్వాలో డిసైడ్ చేసి.. అనర్హుడు అనుకున్న వాళ్ల బెలూన్ పగలగొట్టాలని చెప్పాడు. దీంతో అందరూ పిన్ చేజిక్కించుకోవడానికి సిద్దంగా నిల్చున్నారు. అయితే బజర్ మోగిన వెంటనే లేడి పిల్లలా నయని పరిగెత్తి పిన్ పట్టేసుకుంది. వెంటనే వచ్చి తేజ బెలూన్ పగలగొట్టి.. ఈ హౌస్‌లో మొదటి వారం నుంచి హౌస్‌మెట్ అవ్వడానికి యావర్ తన 100 శాతం ఇచ్చాడంటూ రీజన్ చెప్పుకువచ్చింది.

Nayani Pavani Selects Yawars As The Captain

ఇక యావర్ క్యాప్టెన్ అవ్వడానికి ఈ లేడీ కంటెస్టెంట్ నయని పవని కారణం అయ్యింది. ఇక ఇప్పటికే వీరిమధ్య లవ్ ట్రాక్ మొదలు అయినట్లు తెలుస్తోంది. నేను సింగిల్...బాయ్ ఫ్రెండ్ లేడంటూ యవర్ కు హింట్ ఇచ్చింది ఈ భామ. మరి వీరి మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలు కానుందో నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X