Bigg Boss Voting : బిగ్‌బాస్‌లో ఖాయమైన ఎలిమినేషన్ .. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్!

బిగ్‌బాస్ తెలుగు 8లో భాగంగా 9వ వారం మరో రెండ్రోజుల్లో ముగియనుంది. హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, రొమాన్స్, హాట్ డిస్కషన్స్‌‌తో కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ వారం ఐదుగురు టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండటంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓటింగ్‌లో ఎవరు టాప్‌‌లో ఉన్నారు? 9 వారానికి సంబంధించి ఓటింగ్‌ ఎలా జరుగుతుంది? అనేది ఒకసారి చూస్తే :

ప్రస్తుతం హౌస్‌లో చీఫ్ కంటెండెర్స్‌ని ఎంపిక చేసేందుకు బీబీ ఇంటికి దారేది అనే టాస్క్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ అనేవి ఉండవని బిగ్‌బాస్ తేల్చేయడంతో గ్రూప్‌గా కుండా పర్సనల్‌గా ఆడుతున్నారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలోనే ఓ టాస్క్‌లో ప్రేరణ, యష్మిలను నిఖిల్ ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం దుమారం రేపింది. దీనిపై యష్మి నిలదీయడంతో నిఖిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటి వరకు 5 టాస్క్‌లు జరగ్గా.. బ్లూ టీమ్ మూడు, గ్రీన్, రెడ్ టీమ్‌లు చెరో టాస్క్ గెలిచాయి.

Nayani pavani Still in danger zone in 9th week Voting in bigg boss telugu 8

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి నవ్వులు పంచుతోన్న అవినాష్ - రోహిణిలు గురువారం చిన్నపిల్లల గెటప్‌లో అల్లరి చేశారు. హరితేజ టీచర్‌గా మారి వాళ్లకి అ, ఆలు నేర్పగా.. గౌతమ్‌ని రోహిణి కిస్ కావాలంటూ మారం చేసింది. ఆంటీ నన్ను ఎత్తుకో అంటూ యష్మి వెంటపడ్డాడు అవినాష్.. దీంతో భయపడిన యష్మి నా వల్ల కాదురా , నా నడుం విరిగిపోద్ది అంటూ పరుగులు తీసింది. అయితే ప్రేరణ, విష్ణుప్రియలు అవినాష్‌ను చంకన ఎత్తుకున్నారు. మన కండల వీరుడు నిఖిల్ అయితే అవినాష్, రోహిణిలను చెరో చంకన వేసుకోవడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

నిఖిల్, హరితేజ, అవినాష్, నబీల్, టేస్టీ తేజ, ప్రేరణ‌లు మెగా చీఫ్ రేసులో నిలవడంతో బిగ్‌బాస్ వారికి బీన్ ట్యాగ్ టాస్క్ పెట్టగా.. చివరికి నిఖిల్, అవినాష్, నబీల్ మిగిలారు. టాస్క్ ప్రకారం అవినాష్ బ్యాగ్‌లో ఎక్కువ బాల్స్ ఉండటంతో ఈ వారం అతను హౌస్‌కి కొత్త మెగా చీఫ్ అయ్యాడు. ఇప్పటి వరకు హౌస్‌కి నబీల్, మెహబూబ్, గౌతమ్, విష్ణుప్రియలు మెగా చీఫ్‌లు కాగా.. తాజాగా అవినాష్ ఆ ప్లేస్‌ని దక్కించుకున్నాడు.

Nayani pavani Still in danger zone in 9th week Voting in bigg boss telugu 8

ఇకపోతే.. 9వ వారం ఐదుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారు. వారు గౌతమ్ కృష్ణ, యష్మీగౌడ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్‌ను బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారో, ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి చూస్తే. ఈ వీక్ ఓటింగ్‌ మొదలైన నాటి నుంచి యష్మీ గౌడ నెంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుసగా నాలుగో రోజు కూడా ఓటింగ్‌లో యష్మి టాప్ ప్లేస్‌లో నిలవటం విశేషం.

దాదాపు 36 శాతం ఓటింగ్‌తో యష్మి గౌడ అగ్రస్థానంలో ఉండగా.. ఆమెకు డాక్టర్ బాబు గౌతమ్ 33.25 శాతం ఓటింగ్‌తో టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. తర్వాత వరుసగా టేస్టీ తేజ (26.39) శాతం, హరితేజ (24.08) శాతం ఓటింగ్‌తో నిలిచారు. నయని పావని వరుసగా రెండో రోజు ఓటింగ్‌లో వెనుకబడిపోయారు. (14.91) శాతం ఓటింగ్‌తో ఆమె డేంజర్ జోన్‌లో నిలిచారు. గత వారం కూడా నయని పావని, మెహబూబ్‌ డేంజర్ జోన్‌లో నిలవగా.. ఆమె హౌస్‌ను వీడుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇంకా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి చాలా సమయం ఉండటంతో ఫలితాలు, ర్యాంకింగ్స్ ఎలా మారుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X