Bigg Boss Final Voting : మెంటలెక్కిస్తోన్న ఓటింగ్ .. 75 పర్సెంట్ వాళ్లిద్దరికే, నబీల్ ఆఖరి పోరాటం?
తెలుగు నాట మెగా రియాలిటీ షోగా ఉన్న బిగ్‌బాస్ తెలుగు 8 మరో మూడు రోజుల్లో ముగియనుంది. దాదాపు 100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన ఈ షోకు ఇంకో 72 గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు? ఈసారైనా ఆడపిల్లకు ఛాన్స్ ఇస్తారా? తెలుగువాడికి పట్టం కడతారా? లేక కర్ణాటక వాడు ట్రోఫీని తన్నుకుని పోతాడా అంటూ పెద్ద డిస్కషన్ నడుస్తోంది.
14 మందితో తొలుత బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభమైంది. మధ్యలో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్ శెట్టి, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. దీంతో నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు టాప్ 5లో నిలిచి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 8 విజేత కానున్నారు.

అయితే బిగ్‌బాస్ 15 వారం అంటే ఆఖరి వారం. 14 వారాల వరకు నడిచిన గేమ్ ఇక్కడ ఉండదు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మీదకి వెళ్లిపోవడాలు ఉండవు. దీంతో ఫినాలే వరకు బిగ్‌బాస్ డల్‌గానే ఉంటుంది. ఈ వారం కొందరు గెస్టులు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మమగారు సీరియల్ నుంచి ఆకర్ష్ - సుహాసినీ.. బ్రహ్మముడి నుంచి దీపిక రంగరాజులు హౌస్‌లో అడుగుపెట్టి బాగా ఎంటర్‌టైన్ చేశారు.
ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ జర్నీని చూపించారు బిగ్‌బాస్. ఇందులో ఆయన పోరాటాన్ని పొగిడినట్లే పొగిడి.. గౌతమ్‌ని యష్మి ఎలా ట్రాప్ చేసింది , లాస్ట్‌కి ఎలా మోసం చేసింది చూపించారు. అది చూసిన గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు.. రెస్పెక్ట్ కోసం ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానని చెప్పాడు. ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నానని.. తాను ఎప్పటికీ కామన్ మెన్‌నే అని ఎవరిని ఏమీ ఆశించనని, నా కోసం నేను నిలబడతానని గౌతమ్ తెలిపాడు. నా జీవితాన్ని సరిదిద్దినందుకు బిగ్‌బాస్‌కి ధన్యవాదాలు తెలిపాడు.
కాగా.. టాప్ 5లో ఉన్న నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ విజేత అవుతారన్నది ఉత్కంఠగా మారింది. బయట ఏ ఇద్దరు కలిసినా నిఖిల్ - గౌతమ్‌లలో ఎవరు విన్నర్ కాబోతున్నారో చర్చించుకుంటున్నారు. మరి ఆ రేంజ్‌లో నెక్ టూ నెక్ పోరాటం జరుగుతోంది వీరిద్దరి మధ్య. గౌతమ్‌కి (37.63 శాతం), నిఖిల్‌కి (37.43 శాతం) ఓట్లు పోలైంది. అంటే దాదాపు 75 శాతం ఓట్లు వీళ్లేద్దరే పంచుకుంటున్నారన్న మాట. మిగిలిన 30 శాతం ఓటింగ్‌ను మిగిలిన ముగ్గురు ఫైనలిస్టులు షేర్ చేసుకుంటున్నారు. దీని ప్రకారం నబీల్ (15 శాతం) ప్రేరణ (8 శాతం), అవినాష్ (4 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. మరి వీరిలో ఎవరు విన్నర్ కానున్నారు? బిగ్‌బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటీ ? అనేది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











