పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దు.. నా జీవితంలో చాలా దారుణంగా మోసపోయా..

టెలివిజన్‌తోపాటు వెండితెరపై వినూత్నమైన నటనతో ఆకట్టుకొన్న నీనా గుప్తా తాజాగా వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్‌తో ప్రేమలో పడిన నీనా ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేశారు. వారిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. తాజాగా పెళ్లైన వ్యక్తితో బంధాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ తన ఇన్స్‌గ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోలో ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

క్రికెటర్ రిచర్డ్స్‌తో లివింగ్ రిలేషన్స్

క్రికెటర్ రిచర్డ్స్‌తో లివింగ్ రిలేషన్స్

టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న సమయంలో వెస్టిండీస్ కెప్టెన్, డాషింగ్ క్రికెటర్ వివియన్ రిచ్చర్డ్స్‌తో ప్రేమలో పడ్డింది. ఆ తర్వాత వారిద్దరి సహజీవనం చేశారు. ఆ క్రమంలో మసాబా గుప్తా అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత ఆమె రిచర్డ్స్‌తో విడిపోయి ప్రస్తుతం వివేక్ మెహ్రా అనే చార్డెడ్ అకౌంట్‌ను వివాహం చేసుకొన్నది.

పెళ్లైన వ్యక్తితో సంబంధం

పెళ్లైన వ్యక్తితో సంబంధం

వైవాహిక బంధాలపై నీనా గుప్తా స్పందించారు. దయచేసి పెళ్లైన వ్యక్తితో సంబంధాలు పెట్టుకొవద్దు. నేను అలా చేసి జీవితంలో తీరని గుణపాఠం నేర్చుకొన్నాను. నా లైఫ్‌లో ఎన్నో బాధలను అనుభవించాను. ఇప్పుడు నాకు ఎదురైన అనుభవంతో చాలా మంది స్నేహితులకు సలహా ఇస్తున్నాను. మీరు దయ చేసి అలాంటి పనులు చేయకండి అటూ నీనా గుప్తా పేర్కొన్నారు.

 నా కూతురు విషయంలో

నా కూతురు విషయంలో

తన కూతురు మసబా గుప్తాను పెంచే సమయంలోను అలాగే ఆమెకు పెళ్లి చేయడానికి పడిన కష్టాలను తన ఇంటర్వ్యూలో స్పష్టంగా వెల్లడించారు. రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం నా స్వార్ధం. పిల్లలకు మంచి జరగదని అప్పుడు చాలా మంది స్నేహితులు సలహా ఇస్తే ఆ సమయంలో పెడచెవిన పెట్టాను. నా కూతురు ఒంటరితనంతో బాధపడింది. మరో బిడ్డను కనాలని అనుకొన్నాను. కానీ కుదర్లేదు అని నీనా గుప్తా తెలిపారు.

Recommended Video

'My Pregnancy Was A Difficult Time' Says Neena Gupta | Filmibeat Telugu
నేను చేసిన తప్పు మరెవరూ

నేను చేసిన తప్పు మరెవరూ

నా జీవితంలో చేసిన తప్పును మరోవరూ చేయవద్దు. ముఖ్యంగా యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాలు తీసుకొంటే జీవితంలో ఎలాంటి అస్తవ్యస్త పరిస్థితులు నెలకొంటాయనే విషయాన్ని చెప్పాలనుకొన్నాను. పిల్లల జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది అని నీనా గుప్తా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X