Brahmamudi కావ్యకు హ్యాండిచ్చి బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ చిందులు... నాకేం తక్కువ అంటూ కళావతి రచ్చ!
స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ధారావాహిక ఒకటి. ఇక బిగ్ బాస్ ఫేం మానస్, కన్నడ నటి దీపిక రంగనాథ్ ప్రధాన పాత్రల్లో ఈ సీరియల్ కొనసాగుతుంది. వీరు సీరియల్లో రాజ్, కావ్య అలియాస్ కళావతిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ల జోడి సీరియల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా సందడి చేస్తూంటుంది. అయితే తాజాగా కావ్యకు రాజ్ హ్యాండిచ్చాడు. అంతే కాకుండా బిగ్ బాస్ బ్యూటీతో చిందులు వేశాడు. ఇది చూసిన కావ్య నాకేం తక్కువ అంటూ రచ్చే చేసింది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
బ్రహ్మముడి సీరియల్.. దీనికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ మాటీవీలో ప్రసారం అయ్యే ధారావాహికల్లో బ్రహ్మముడి టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ క్యాస్ట్ రాజ్, కావ్య (మానస్, దీపికా)లకు మస్త్ క్రేజ్ లభిస్తుంది. వీళ్లు అప్పుడప్పుడు పలు ప్రోగ్రామ్స్ లో కూడా సందడి చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాని కావ్య మాట్లాడుతుంటే భలే క్యూట్ అనిపిస్తుంది. ఆమె మాటలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికీ కావ్య ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా స్టార్ మాటీవీలో సూపర్ సింగర్ కార్యక్రమం ముగియడంతో దాని ప్లేస్ లోకి నీతోనే డ్యాన్స్ 2.ఓ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దీనికి సీరియల్ జోడిలు, రియల్ జోడిలు వచ్చి సందడి చేయబోతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అలనాటి సీనియర్ హీరోయిన్ రాదా, డ్యాన్స్ మాస్టార్ తరుణ్, అందాల ముద్దుగుమ్మ సదా దీనికి జడ్జ్ లుగా వ్యవహారిస్తున్నారు. ఇక అందాల భామ శ్రీముఖి దీనికి యాంకర్ గా వ్యవహారిస్తుంది.
ఇక ఈ కార్యక్రమం మెగా లాంఛ్ మార్చి 23వ తేదీ అంటే శనివారం ప్రారంభం కానుంది. ఇప్పటికే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాం సక్సెస్ కావడంతో ఇప్పుడు 2.ఓ పేరుతో సీజన్ 2 తీసుకువస్తుంది. ఈ ప్రోగ్రాం శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సీరియల్ జోడిలు, బిగ్ బాస్ ఫేమ్స్, రియల్ జోడిలు పాల్గొన్నాయి. ఇక అందులో బిగ్ బాస్ ఫేం, బ్రహ్మముడి నటుడు మానస్ కు జోడిగా ఓ బిగ్ బాస్ బ్యూటీ పాల్గొంది.
ఆమె ఎవరో కాదు.. శుభ శ్రీ రాయగురు. ఈ బ్యూటీ బిగ్ బాస్ షోలో తన అందంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజ్ అలియాస్ మానస్ తో కలిసి చిందులు వేసింది. ఇక ఈ ప్రోమోలో రాజ్ ఆమెతో కలిసి చిందులు వేయడంతో కావ్య ఎంటర్ అవుతుంది. అందరూ జోడిల్లాగా వస్తే.. నన్ను వదిలేసి ఆమెతో వచ్చావ్ అంటూ రచ్చ చేస్తుంది. నాకేం తక్కువ అంటూ కావ్య రెచ్చిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఆ ప్రోమోపై లుక్ వేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











